ఛాయ్ తాగుతూ ఫ్రీగా మొబైల్ లో ఇంటర్నెట్ వాడుకోండి అంటున్నాడు ఈ
టీ కొట్టు బఘుల్. గుజరాత్ లోని వడోదరలో రోడ్డు పక్కన చిన్న టీకొట్టు వ్యాపారి ఈ
సంజయ్ బఘుల్. అతని దగ్గర టీ తాగడానికి వచ్చే వారికి ఫ్రీగా వైఫై సదుపాయం
కల్పిస్తున్నాడు. నా దగ్గర టీ తాగక పోయినా పర్వాలేదు, ఇంటర్నెట్ ను మాత్రం
ఫ్రీగానే యాక్సెస్ చేసుకోవచ్చని సవినయంగా చెబుతున్నాడు. జనానికి ఉచితంగా వైఫై
సదుపాయాన్ని కల్పించడం వల్ల సంజయ్ బఘుల్ అధనంగా ఏమైనా ప్రయోజనం కోరుకుంటున్నాడా
అంటే అదేమీ లేదంటున్నాడీ ఈ ఛాయ్ వాలా. జనం మాత్రం హాయిగా టీ తాగుతూ తమ మొబైల్ ఫోన్లలో
ఇంటర్నెట్ సౌకర్యాన్ని ఆస్వాదిస్తూ, సంజయ్ కు థాంక్స్ చెప్పుకుంటున్నారు.
సంజయ్ ఎందుకు ఈ పని చేస్తున్నాడు అంటే ప్రధాని నరేంద్ర మోదీ
‘డిజిటల్ ఇండియా’స్వప్నం తనను ఎంతగానో ఆకర్షిందని చెబుతున్నాడు. 2019 నాటి
దేశంలోని రెండున్నర నుండి మూడు లక్షలకు పైగా గ్రామాలకు ఫాస్ట్ ఇంటర్నెట్ కల్పించే
డిజిటల్ ఇండియా కార్యక్రమానికి పెద్ద పెధ్ధ పారిశ్రామికవేత్తలు ఎంత సహకారం
ఇస్తున్నారో తనకు తెలియదు కానీ ఓ సాధారణ ఛాయ్ వాలా తన వంతు సాయంగా ఇలా చేస్తూ
అందరి మన్ననలు పొందుతున్నాడు.
ఇంటర్నెట్ సదుపాయాన్ని ఉచితంగా అందించడం మొబైల్ సర్వీస్
ప్రొవైడర్లకు అసాధ్యమేమీ కాదు. కానీ అలా చేస్తే తమ వ్యాపార సౌధాలు ఎక్కడ
కూలుతాయోనని సర్వీస్ ప్రొవైడర్ల భయం. దేశ వ్యాప్తంగా ఉన్న వ్యాపార సంస్థలు గట్టిగా
తలచుకుంటే ఫ్రీగా ఇంటర్ నెట్ అందించడం పెద్ద కష్టమేమి కాదని నిపుణులు అభిప్రాయం.
ఇప్పటికే బహిరంగ ప్రదేశాల్లో, షాపింగ్ మాల్ల్స్ లలో చాలా చోట్ల ఉచితంగా ఫ్రీ వైఫై
సౌకర్యం కల్పిస్తున్నారు. ఈ విషయంలో సంజయ్ బఘుల్ దేశంలోనే అందరికీ ఆదర్శ ప్రాయంగా
నిలిచాడు..
Sign up here with your email
ConversionConversion EmoticonEmoticon