వాషింగ్టన్ : సరిగ్గా అధ్యయనం చేస్తే ఎక్కువమంది మెంటలోళ్ళు
(మానసిక రోగులు) అమెరికాలోనే కన్పిస్తారు. కొందరి ప్రవర్తన చాలా విచిత్రంగా వుంటుంది.
తాజాగా అమెరికాలోని వాల్‌మార్ట్ సూపర్ మార్కెట్‌లోకి ఒక వ్యక్తి ప్రవేశించి, సడన్‌గా
తన ఒంటిమీదున్న బట్టలు తీసేసి, ఒళ్ళంతా మంటలు పుడుతున్నాయంటూ అక్కడే వున్న పాలు (మిల్క్)ను
తన ఒంటిపై పోసుకున్నాడు.
షాపులో వున్న వారంతా అతని విచిత్రమైన ప్రవర్తన చూసి విస్తుపోయారు.
లేడీస్ తిట్టుకుంటూ కళ్లు మూసుకున్నారు. అతని కాలికి సాక్సులు, షూస్ తప్ప ఒంటిపై
ఇంకేమీ లేవు. ఒక గ్యాలన్ పాలును ఒంటిపై పోసుకున్న తర్వాత అరుస్తూ బయటకు పారిపోయి,
అప్పటికే సిద్ధంగా వున్న తన మిత్రుడి కారులోకి దూకి అతనితో కలసి పారిపోయాడు. ఇదంతా
వీడియోలో రికార్డయింది. వారిద్దర్నీ డేవిడ్ డేనియల్స్, తిమోతీ స్మిత్‌లుగా గుర్తించారు.
వారిపై వాల్‌మార్ట్ సంస్థ కేసు కూడా పెట్టింది.
Sign up here with your email
ConversionConversion EmoticonEmoticon