సాధారణంగా మహిళలకు లైంగిక వేధింపులు మగరాయుళ్ల నుంచి ఎదురవుతుంటాయి.
కానీ, దేశ రాజధాని ఢిల్లీలో తద్విరుద్ధంగా ఓ సంఘటన చోటుచేసుకుంది. ఆటోలో
ప్రయాణించిన ఓ మహిళ.. శారీరకంగా తృప్తిపరచాలంటూ ఆటో డ్రైవర్‌ను బలవంతం పెట్టి,
వేధింపులకు పాల్పడి జైలుపాలైంది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను సఫ్దార్‌జంగ్ ఎన్‌క్లేవ్ పోలీస్‌స్టేషన్
ఇన్‌స్పెక్టర్ విశుద్ధానంద్ ఝా వెల్లడించారు. దక్షిణ ఢిల్లీలోని సాకేత్
ప్రాంతానికి చెందిన రేణూ లాల్వానీ అనే మహిళ... బుధవారం మధ్యాహ్నం సాకేత్ నుంచి ఏడు
కిలోమీటర్ల దూరంలో ఉన్న అర్జున్ నగర్‌లోని తన ఫ్లాట్‌కు వెళ్లేందుకు ఒక ఆటోలో
ఎక్కింది. ఈ ఆటోను 41 యేళ్ళ ఉమేష్ ప్రసాద్ అనే డ్రైవర్ నడుపుతున్నాడు. అర్జున్
నగర్ చేరుకున్న తర్వాత ఆటో డ్రైవర్‌ను ఇంట్లోకి ఆహ్వానించింది. ఆ సమయంలో ఇంట్లో
రేణూ రూమ్మెట్ కూడా ఉంది. ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్‌కు తాగేందుకు
మంచినీరు ఇచ్చి.. ఉన్నట్టుండి తలుపులు లాక్ చేసింది. శారీరకంగా సంతృప్తిపరచమని
ప్రాధేయపడింది. దీనికి ఆటో డ్రైవర్ సమ్మతించలేదు.
పిమ్మట వైన్ ఆశ చూపింది. దీనికి కూడా ఉమేష్ లొంగలేదు. దీంతో
పిచ్చెక్కినట్టు ప్రవర్తించిన ఆ మహిళ.. అతడిని బలవంతంచేసి.. బట్టలను చింపేసి..
ముద్దుపెడుతూ.. తన పైశాచికత్వాన్ని ప్రదర్శించింది. ఈ తతంగాన్నంతా ఇంట్లో ఉండే తన
రూమ్మెట్ వీడియో తీసింది. ఆ తర్వాత వీరిద్దరూ ఏదో చర్చించుకునేందుకు మరో గదిలోకి
వెళ్లగా.. ఇదే అదనుగా భావించిన ఆటో డ్రైవర్ అక్కడ నుంచి పారిపోయాడు. ఈ క్రమంలో అతని
కాలు కూడా విరిగిందని ఝా చెప్పారు.
దీనిపై ఆటో డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. కేసు నమోదు చేసి రేణూను
అరెస్టు చేసినట్టు చెప్పారు. ఆమె వద్ద నుంచి నాలుగు బ్యాడ్జీలు, నాలుగు డ్రైవింగ్
లైసెన్సులను స్వాధీనం చేసుకున్నామని, గతంలో కూడా ఇదేవిధంగా నలుగురు డ్రైవర్లను
బలంవంతం చేసి తృప్తి తీర్చుకున్నట్టు తెలుస్తోందని, దీనిపై ఆరా తీస్తున్నట్టు
చెప్పారు. కాగా, రేణు రూమ్మెట్‌గా ఉన్న మరో మహిళను టాంజానియా దేశస్థురాలిగా
గుర్తించారు. ఈమె సినిమాల్లో నటించేందుకు ప్రయత్నిస్తున్నట్టు విచారణలో
వెల్లడైంది. ఈమె ప్రస్తుతం పరారీలో ఉంది. దీనిపై కేసు నమోదుచేసి దర్యాప్తు
జరుపుతున్నారు.
Sign up here with your email
ConversionConversion EmoticonEmoticon