పారితోషకం తీసుకోవాలంటూ పిలిచి ఓ మరాఠీ నటిపై దుండగులు సామూహిక
అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెను కిడ్నాప్ చేసి 60కి.మీ తీసుకెళ్ళి ఆపై ఐదు మంది
విరుచుకుపడ్డారు. వారిలో పోలీసులు కొందరిని అరెస్టు చేశారు. వివరాలిలా ఉన్నాయి.
ఆనంద్ మఘాడే అనే డైరెక్టర్ తన స్నేహితుడైన గోవింద్ చిట్లాంగేకు..
సినిమా కోసం ఓ హీరోయిన్ కావాలని చెప్పాడు. దాంతో ముంబైకి చెందిన ఆ అమ్మాయిని ఎంపిక
చేశారు. అయితే ఆమెకు డబ్బులు మాత్రం ఇవ్వలేదు. ముంబై శివారు ప్రాంతానికి చెందిన
ఈ నటి సినిమా షూటింగ్ కోసం పైఠాన్ జిల్లాకు వెళ్లింది. రెండు నెలల పాటు అక్కడే
ఉన్న ఆమె.. ఆదివారం నాడు తన డబ్బు తీసుకోడానికి ఔరంగాబాద్‑కు వచ్చింది.
దర్శకుడి స్నేహితుడి వద్దకు తన పారితోషికం కోసం వెళ్లగా, అతడు ఆమెను
అక్కడి నుంచి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న పైఠాన్ వద్దకు తీసుకెళ్లి, అక్కడ
మరో నలుగురితో కలిసి సామూహిక అత్యాచారం చేశారు. ఆమెను నిర్జన ప్రదేశానికి
తీసుకెళ్లి అక్కడ మరో నలుగురితో కలిసి సామూహిక అత్యాచారం చేసినట్లు ఇన్‑స్పెక్టర్
చెప్పారు. చిట్లాంగేను ఇప్పటికే అరెస్టు చేయగా.. మిగిలిన నలుగురు నిందితులు
పరారీలో ఉన్నారు.
Sign up here with your email
ConversionConversion EmoticonEmoticon