బాలీవుడ్‌లో ఏక్తా కపూర్ పలు శృంగార చిత్రాలకు ప్రసిద్ధి. ఆమె తీసిన
చిత్రాలు ఏదో రకంగా వార్తల్లో వుంటాయి. అయితే అక్కడ కల్చర్... హాలీవుడ్ కల్చర్‌కు
తగినట్లుగా కొంత వుంది. కానీ.. టాలీవుడ్‌లో అటువంటి కల్చర్‌ను తీసుకువచ్చే
ప్రయత్నం చేస్తున్నాడు శ్రీరాజన్. వాస్తవానికి ఆయన కన్నడిగుడు. అయినా తెలుగులో పలు
సీరియల్స్‌లో నటించాడు. ఇప్పుడు ఏకంగా హార్రర్ సినిమా అంటూ 'ఎఫైర్'
తీస్తున్నాడు.
ఇందుకు రామ్‌గోపాల్ వర్మతో ఐస్‌క్రీమ్ వంటి చిత్రాన్ని తీసిన
రామసత్యనారాయణ నిర్మాతగా వున్నాడు. బుధవారంనాడు చిత్రంలోని కొన్ని స్టిల్స్.. బయటకు
తెచ్చారు. కథ ప్రకారం.. లెస్బియన్స్ స్టోరీ. ఇద్దరు ఆడవాళ్ళు ప్రేమించుకుంటే ఎలా
వుంటుందనేది కాన్సెప్ట్.
అయితే స్టిల్స్‌పై ఏదోరకంగా చర్చ జరగాలని వాటివి విడుదల చేశాడు దర్శక
నిర్మాతలు. అయితే ఈ చిత్రానికి సెన్సార్ ఎలా వస్తుందనేది ఆసక్తికరంగా మారింది. యువతను
తప్పుదోవ పట్టించే ఇటువంటి చిత్రాలు చిత్రపరిశ్రమకు మంచిది కాదని కొందరు
పేర్కొంటున్నారు.
Sign up here with your email
ConversionConversion EmoticonEmoticon