0

స్మార్ట్‌ఫోన్‌తో ఇంట్లోనే గర్భ నిర్ధారణ

cell

బెర్లిన్‌: ఇంట్లోనే ప్రెగ్నెన్సీ నిర్ధారణ చేసుకునేందుకు మార్కెట్లో రకరకాల ‘కిట్‌’ లు అందుబాటులో ఉన్నా యి. తాజాగా ఈ జాబితాలోకి స్మార్ట్‌ఫోన్‌ కూడా చేరింది. అవును స్మార్ట్‌ఫోన్‌తో క్షణాలలో ప్రెగ్నెన్సీ నిర్ధారణ చేసుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. 

ఇందుకోసం ఆప్టికల్‌ సెన్సర్‌ అమర్చిన చిన్న పరికరాన్ని స్మార్ట్‌ఫోన్‌కు అనుసంధానించాల్సి ఉంటుందని వివరించారు. దీంతో మరో ప్రయోజనమూ ఉందట. మధుమేహ బాధితులకూ ఈ పరికరం ఉపయోగకరంగా ఉంటుందని యూనివర్సిటీ ఆఫ్‌ హానోవర్‌ పరిశోధకులు తెలిపారు. మధుమేహ బాధితులు తమ రక్తంలోని చక్కెర స్థాయులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ఆహారాన్ని నియంత్రించుకోవాల్సి ఉంటుంది. 

ఇందులో భాగంగా.. తరచుగా చక్కెర స్థాయులను తెలుసుకోవడం తప్పనిసరి. ఈ క్రమం లో తాజా పరికరం ఉపయుక్తంగా ఉంటుందట. దీన్ని స్మార్ట్‌ఫోన్‌కు అనుసంధానించి, ఫోన్‌లోని యాప్‌ సాయంతో రక్తంలో చక్కెర నిల్వలను ఇట్టే తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
Previous
Next Post »