‘బాహుబలి’ చిత్రం బాలీవుడ్‌లో పెద్ద హిట్ అయితే ఇక ప్రభాస్ అక్కడే
తన దృష్టిని కేంద్రీకరించనున్నాడని వార్తలు వస్తున్నాయి. దీనిలో భాగంగానే అవకాశాలు
వస్తే హిందీలో కూడా నటిస్తానని ప్రభాస్ ఇప్పటికే వెల్లడిరచాడు. కాగా బాలీవుడ్‌లో మీరు
హీరోగా నటిస్తే మీ సరసన ఏ హీరోయిన్ అయితే బాగుంటుంది... అనే ప్రశ్నకు ప్రభాస్ సమాధానం
ఇస్తూ... నాకైతే నా సరసన దీపికాపడుకొణె అయితే బాగుంటుందని అనుకుంటున్నాను. ఆమె నటన
అంటే నాకు చాలా ఇష్టం. ఎలాంటి పాత్ర అయినా సమర్థవంతంగా పోషిస్తుంది. ముఖ్యంగా ఆమె కళ్లు
నన్ను బాగా ఆకర్షిస్తాయి అని చెప్పుకొచ్చాడు ప్రభాస్. సో.. ప్రభాస్ రేపు ఏదైనా బాలీవుడ్
సినిమా ఒప్పుకుంటే హీరోయిన్ కోసం వెదికేపని ఉండదు అంటున్నారు. అందులో దీపికాపడుకొనేను
ఖాయం చేసుకోవడమే మిగిలింది అంటూ ప్రభాస్ గురించి అనుకుంటున్నారు.
Sign up here with your email
ConversionConversion EmoticonEmoticon