చెక్ బౌన్స్
కేసుల గురించి ఎప్పటికప్పుడు వింటూనే ఉన్నాం. ఫలానా నిర్మాత ఫలానా నటికి చెక్కు
రాసిస్తే అది కాస్తా బౌన్స్ అయ్యిందన్న వార్తలు గతంలో వినవచ్చాయి. ఇప్పుడు సరిగ్గా
అలాంటి కేసులోనే ఓ బాలీవుడ్ నిర్మాత ఇరుక్కున్నాడు. అయితే ఈ చెక్‌బౌన్స్ వ్యవహారం
తనని ఏమాత్రం ఇబ్బంది పెట్టదని కవర్ చేసేస్తోంది బాలీవుడ్ హాట్ గాళ్ రిచా చద్దా.
ఈ అమ్మడు నిర్మాతలతో ఏమాత్రం గొడవ పడకుండా సంయమనం పాటించడమే కాదు.. అసలు
సినిమా పరిశ్రమలో తనకి అవకాశం దక్కడమే ఓ వరం అని చెబుతోంది. అంతేనా ఇక్కడికి
డబ్బుల కోసమే రాలేదు. సినిమా ల్లో నటించాలన్న దాహం తీర్చుకోవాలని వచ్చాను. వస్తూనే
బోలెడంత పేరొచ్చింది. ఫేమొచ్చింది. స్నేహాలు పెరిగాయి.. అంటూ చెప్పుకొచ్చింది.
అన్నట్టు
రిచా పరిశ్రమకి వచ్చిన కేవలం మూడేళ్లలోనే బోలెడన్ని అవార్డులు అందుకుంది. ఫిలింఫేర్
ఉత్తమనటిగానూ పాపులర్ అయ్యింది. గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ చిత్రంతో మంచి పేరు, గుర్తింపు
వచ్చింది. ఇప్పుడు మసాన్ అనే చిత్రం రిలీజ్‌కి వస్తోంది.
Sign up here with your email
ConversionConversion EmoticonEmoticon