0

డ్రైవర్ హస్తప్రయోగం చేసుకున్నాడు: లేడీ ప్యాసెంజర్ సీరియస్

Cab driver masturbated while driving, claims woman passenger
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారుతుందని చెప్పడానికి మరో దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటన మంగళవారంనాడు వెలుగు చూసింది. జులై 2వ తేదీన ఢిల్లీ నుంచి ఫరీదాబాద్‌కు టాక్సీ మాట్లాడుకున్న ఓ మహిళ భయానకరమైన దృశ్యాన్ని చూసింది. ఆ భయానకమైన సంఘటనను ఆమె ఫేస్‌బుక్‌లోనూ ట్విట్టర్‌లోనూ వివరించింది. తాను ప్రయాణిస్తున్న టాక్సీని నడుపుతూ టాక్సీ ఫర్ స్యూర్ క్యాబ్ డ్రైవర్ హస్తప్రయోగం చేసుకున్నాడని ఆమె చెప్పింది. తాను ఓలాక్యాబ్స్‌క ఫోన్ చేస్తే టాక్సీ ఫర్ స్యూర్ క్యాబ్ వచ్చిందని ఆమె చెప్పింది.

ఈ సంఘటన వెలుగు చూడడంతో టాక్సీ ఫర్ స్యూర్ డ్రైవర్ దేవందర్ కుమార్‌ను ఉద్యోగం నుంచి తొలగించింది. నిరుడు డిసెంబర్‌లో 25 ఏళ్ల మహిళా ఎగ్జిక్యూటివ్‌పై ఉబేర్ క్యాబ్ డ్రైవర్ అత్యాచారం చేసిన సంఘటనను మరిచిపోక ముందే ఈ సంఘటన వెలుగు చూసింది. నిరుడు డిసెంబర్ 5వ తేదీన మహిళా ఎగ్జిక్యూటివ్‌పై ఓ నిర్మానుష్యమైన ప్రదేశంలో ఉబేర్ క్యాబ్ డ్రైవర్ అయిన 32 ఏళ్ల శివకుమార్ యాదవ్ అత్యాచారం చేశాడని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.

Previous
Next Post »