0

షాక్ కొట్టిన ఏటిఎం: యువకుడు మృతి


 A youth died electric shock when inserting debit card in ATM
లక్నో: ఏటిఎంలో కార్డు పెడుతుండగా ఓ యువకుడు విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో చోటు చేసుకుంది. 
  
జాంఘైకి చెందిన బ్రిజేశ్‌కుమార్‌ అనే వ్యక్తి వర్షంలో తడుస్తూ ఏటీఎంకు వెళ్లాడు. కార్డు మిషన్‌లో పెట్టగానే బ్రిజేష్‌కు విద్యుత్‌ షాక్‌ తగిలింది. ఏటీఎం ఓ పాత భవనంలో ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. వర్షంలో బాగా తడిసిన బ్రిజేశ్ కుమార్.. డబ్బులు డ్రా చేసుకునేందుకు ఏటిఎం యంత్రంలో తన డెబిట్ కార్డును పెట్టాడు. వెంటనే షాక్ కొట్టడంతో అక్కడే కుప్పకూలిపోయాడు.


బ్రిజేశ్ అక్కడికక్కడే మృతి చెందడంతో ఘటనకు సంబంధించిన వివరాలు స్పష్టంగా తెలియడం లేదు. ఏటిఎం సెక్యూరిటీ గార్డు కూడా ఘటనకు సంబంధించి ఎలాంటి వివరాలు చెప్పడంలేదు. 

కాగా, ఏటిఎం కేంద్రంలో సెక్యూరిటీ గార్డు ఉన్నప్పటికీ బ్రిజేశ్‌ను తడిబట్టలతో ఏటిఎం లోపలికి ఎందుకు అనుమతిచ్చారో తెలియడం లేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.








ConversionConversion EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng