0

తిరుమల శ్రీవారికి 4కోట్ల ఆస్తి రాసిస్తా: ఓ వృద్ధ భక్తురాలు

తిరుపతి: ఓ వృద్ధ భక్తురాలు తన దైవ భక్తిని చాటుకున్నారు. తన ఇష్టదైవమైన తిరుమల వెంకటేశ్వరస్వామికి ఏకంగా రూ. 4 కోట్లు దానం చేసేందుకు ముందుకు వచ్చారు. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లాలోని నాగలాపురానికి చెందిన పద్మావతి (85)పేరిట దాదాపు రూ.4 కోట్ల ఆస్తి ఉంది.

కాగా, ఆమెకు నా అన్నవారు లేకపోవటం.. ఆలనాపాలనా చూసుకునే వారు కరువవడంతో.. తన ఆస్తిని శ్రీవారికి విరాళంగా ఇచ్చేందుకు ఆస్తులకు సంబంధించిన పత్రాలతో తిరుమల వచ్చారు.

లేవలేని స్థితిలో ఉన్న ఆమె, చేయి విరిగి కట్టుకట్టుకొని టిటిడి రెవెన్యూ అధికారులకు ఆస్తి పత్రాలను ఇచ్చేందుకు వచ్చారు.

ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తనపై ఉన్న ఆస్తి అన్యాక్రాంతమవుతోందని ఆవేదన వెలిబుచ్చారు. కష్టపడి సంపాదించిన ఆస్తిని ఇతరులకు పోకుండా, ఇష్టదైవమైన శ్రీవారి పాదాల చెంత ఉంచి, తుదిశ్వాస విడుస్తానని తెలిపారు
Previous
Next Post »