సీనియర్ కమెడియన్ ఆలీ
తన నోటిని అదుపులో పెట్టుకున్నాడట. ఎందుకు అనుకుంటున్నారా..? నిజానికి ఆలీ గొప్ప
కమెడియన్ ఛైల్డ్ ఆర్టిస్ట్ నుంచి అనేక డక్కాముక్కిలు తిని వచ్చిన వాడు. అలాంటి
వ్యక్తి డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో ఇబ్బంది పెడుతున్నారని అంటున్నారు. ముఖ్యంగా
ఆలీ నిర్వహిస్తున్న ఓ షోకి వచ్చే ప్రతి ఆర్టిస్ట్ ఈ డబుల్ మీనింగ్ డైలాగ్స్‌కి
గురవుతున్నారట.
కాకలు
తీరిన యాంకర్స్ కూడా ఈషోకు వచ్చి..ఆలీ విసురుతున్న డబుల్ మీనింగ్స్ డైలాగ్స్‌కు
మోహం పక్కకు తిప్పుకుని సిగ్గుపడుతున్నారట. అంతలా ఆలీ తన డబుల్ మీనింగ్ పంచ్‌లు
వేస్తుండటంతో…ఇండస్ట్రీ పెద్దలు కాస్తా ఆలీని
మందలించారని వినికిడి. దీనితో వారికి ఇబ్బంది కలిగించకుండా నోటిని కొంచెం అదుపులో
పెట్టుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
Sign up here with your email
ConversionConversion EmoticonEmoticon