ప్రాణాలను కాపాడే డాక్టర్‌ను పలువురు ప్రత్యక్ష దైవంగా అంటారు. అది
నిజమే. చైనాలో ఓ డాక్టర్ ప్రాణాలనే కాదు చేతిని కూడా బతికించారు. చేతిని బతికించడం
ఏమిటంటారా.. అయితే ఈ వార్తను చదవండి. చైనాకు చెందిన జో అనే కార్మికుడు విధి
నిర్వహణలో ఉండగా ప్రమాదానికి గురయ్యాడు. అతడి ఎడమ చేయి మిషన్‌లో పడి మణికట్టు వరకు
తెగిపోయింది. వెంటనే అతన్ని స్థానిక హాస్పిటల్‌కు తరలించారు.
జోకి ప్రాణపాయం లేకపోయినా ఆయన చేతిని మాత్రం తీసివేయాల్సి వచ్చింది.
అయితే చెయ్యిలేకపోతే కష్టమని భావించిన వైద్యులు గ్జియాంగ హాస్పిటల్‌కు వెళ్లమని
జో కి సలహా ఇచ్చారు. ఆ ఆస్పత్రికి వెళ్లగా అక్కడి వైద్యులు అతికించడానికి
వీల్లేకుండా ఉన్న చేతిలోని నరాలు, టిష్యూలను రక్షించి, ఆ చేతికి ప్రాణం పోసేందుకు
నిర్ణయించారు. చచ్చుబడిన ఆ చేతిని కాలుకి అతికించారు.
ఆ చేతిలోని నరాలకు కాలు ద్వారా రక్త ప్రసరణ అయ్యేలా ఆపరేషన్ చేశారు.
కష్టపడి చేసిన శస్త్ర చికిత్స ఫలించింది. దీంతో నెలరోజుల్లో విరిగిన చేయికి మళ్లీ
జీవం వచ్చింది. చేతి వేళ్లల్లో కదలిక రావటంతో వెంటనే డాక్టర్లు మళ్లీ ఆ చేతిని
యథాస్థానంలో ఉంచి ఆపరేషన్ చేశారు. ఈ విధంగా జో చేతిని బతికించారు. ప్రస్తుతం
వైద్యుల పర్యవేక్షణలో ఉన్న జో పోయిన చేయి తిరిగి రా
Sign up here with your email
ConversionConversion EmoticonEmoticon