ప్రియుడి కోసం రోడ్డుపైనే కొట్టుకున్న యువతులు
యువతి కోసం ఇద్దరు యువకులు కొట్టుకోవడం సహజం.కాని ఈ సారి కాస్త డీపరేంట్ గా ఓ యువకుడి కోసం ఇద్దరు అమ్మాయిలు నడిరోడ్డుపైనే కొట్టుకున్నారు.మీరు చదివింది నిజమే.. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ జిల్లా మాధవపురంలో చోటు చేసుకుంది.
మాధవపురం కు చెందిన పూజ అనే యువతి స్థానికంగా ఉంటు ఓ మొబైల్ షోరూంలో పని చేస్తోంది.అక్కడే ఓ యువకుడితో సన్నిహితంగా ఉంటుంది..దాంతో ఆ యువకుడిని ప్రేమిస్తున్న ఆర్థి అనే మరో యువతికి ఈ వ్యవహరం పై చిర్రెతుకు వచ్చింది..అంతే తను ప్రేమిస్తున్న వ్యక్తిని..పూజ తనకు కాకుండా చేస్తోందని మొబైల్ షోరూంలో ఉన్న పూజ బయటికి పిలిచి వార్నింగ్ ఇచ్చింది..తన ప్రియుడికి దూరంగా ఉండాలని హెచ్చరించింది.
అయితే ఆర్తి మాటలను పూజ పట్టించుకోలేదు.దీంతో ఆగ్రహానికి గురైన ఆర్తి..పూజను రోడ్డు పైనే కొట్టడం ప్రారంభించింది.దీంతో పూజ సైతం ఎదురుదాడి చేసింది..ఇద్దరు తీవ్రంగానే కొట్టుకున్నారు.ఈ ఘటనను చూసిన స్థానికులు వీడియోలు తీస్తూ నవ్వుకున్నారు. మరి కొందరు వారిని వారించేందుకు ప్రయత్నించారు.కాగా, ఈ వీడియో ఆన్‌లైన్‌లో ఇప్పుడు హల్‌చల్ చేస్తోంది.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు..
Sign up here with your email
ConversionConversion EmoticonEmoticon