మెట్రో
రైలులో ప్రయాణం డీఎంకే పార్టీ కోశాధికారి స్టాలిన్‌కు కొత్త వివాదం
తెచ్చిపెట్టింది. చెన్నైలో ఇటీవల ప్రారంభించిన మెట్రో రైలులో స్టాలిన్ తన
అనుచరులతో ప్రయాణించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో స్టాలిన్ ఓ ప్రయాణికుడిని
చెంపదెబ్బ కొట్టినట్లు వీడియో ఫుటేజ్ ద్వారా తెలియవచ్చింది. రైలులో నిలుచుని ఉన్న
స్టాలిన్ ఓ వ్యక్తి చెంప చెళ్లుమనిపించినట్టు వీడియో ఫుటేజీలో తేలింది.
అయితే అతను పార్టీ కార్యకర్త అని, స్టాలిన్ పక్క నిలుచున్న
అతన్ని అక్కడ్నుంచి వెళ్లిపోవాలని అడిగినట్లు సమాచారం. ఈ ఆరోపణలను డీఎంకే
ఖండించింది. రైలులో కూర్చుని ఉన్న మహిళల పక్కన ఉన్న అతడిని వెళ్లిపోవాలని మాత్రమే
అడిగినట్టు చెబుతోంది. ఇంకా అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా మాత్రమే స్టాలిన్
సూచించారని.. ఆ వ్యక్తిపై ఉద్దేశపూర్వకంగా చేజేసుకోలేదని డీఎంకే పేర్కొంది.
ఇకపోతే.. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఈ చర్యను తీవ్రంగా ఖండించారు.
Sign up here with your email
ConversionConversion EmoticonEmoticon