చెన్నై: తమిళ నటుడు కె. కృష్ణకుమార్ ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసిండు. ఇందుకు గల కారణాలను ఆయన పిటిషన్‌లో ఈ విధంగా పేర్కొన్నారు.
6 ఫిబ్రవరి, 2014లో హేమలత రంగనాథన్‌తో నా వివాహం జరిగింది. ఉమ్మడి కుటుంబంతో కలిసి వైవాహిక జీవితాన్ని ప్రారంభించాం. కానీ హేమలత మా కుటుంబంతో సఖ్యతగా మెలిగేది కాదు. వేరు కాపురం పెడదామని ఒకటే పోరు. భర్తగా ఆమె సేవలను నేను ఏ విధంగానూ పొందలేదు. తరచూ గొడవలు పెట్టుకునేది. తన అనుమాన బుద్ధితో నాకు నరకం చూపించేది.
తన చర్యల ద్వారా వృత్తిపై శ్రద్ధ చూపించలేకపోతున్నాను. తనను తాను గాయపరచుకొని నన్ను బలిపశువుగా చూపించేది. వైవాహిక జీవితానికి విలువనిచ్చి గత 14 నెలలుగా తను పెడుతున్న హింసలన్నింటినీ భరించా. ఇకపై తనతో కలిసి ఉండలేనని పేర్కొన్నారు.
కాగా మరోవైపు హేమలత కూడా కృష్ణకుమార్ తనను హింసిస్తున్నాడంటూ పేర్కొంటూ గడిచిన మార్చిలో నిర్మాతల కౌన్సిల్‌కు ఫిర్యాదు చేసింది. అదేవిధంగా అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడంటూ పేర్కొంటూ కేసు వేసింది.
కృష్ణకుమార్ మద్యం వ్యసనపరుడని, ఇతర మహిళలతో సంబంధాలు ఉన్నాయంటూ ఆరోపిస్తూ కోయంబత్తూరులోని సోషల్ వేల్ఫేర్ బోర్డును ఆశ్రయించింది. ఫిర్యాదును స్వీకరించిన బోర్డు కృష్ణప్రసాద్‌కు నోటీసులను పంపించింది.
Sign up here with your email
ConversionConversion EmoticonEmoticon