0

అఖిల్ రెండవ సినిమా డైరెక్టర్ ఖరారు

Akhil-Akkineni-Movie-Stills-Akhil-Akkineni-Movie-Stills-Photos-VV-Vinayak-Akhil-Akkineni-Movie-Stills-Akhil-New-Movie-Stills-Akhil-Akkineni-Photos
అక్కినేని నట వారసుడు అఖిల్ మీద చాలా అంచనాలు ఉన్నాయ్. మొదటి సినిమానే వినాయక్తో ఒప్పుకొని అంచనాలు పెంచాడు . ఇప్పటికే వచ్చిన చిన్న చిన్న మేకింగ్ వీడియోస్ లో ఇరగేసాడు. నాగార్జున కూడా అఖిల్ విషయం లో చాల మంచి ప్లానింగ్ తో ఉన్నట్లు తెలుస్తుంది.
రెండవ సినిమా కూడా పెద్ద డైరెక్టర్ని తీస్కోవాలి అని నాగార్జున ముందే ఫిక్స్ అయ్యాడు. రెండవ సినిమా అన్నపూర్ణ బ్యానర్ లోనే తియ్యాలి అని నాగార్జున అంటున్నాడట. తొలుత రాజమౌళి అని కొన్ని వదంతులు వినిపించిన అవి ఆఖరికి వర్క్ అవుట్ అవ్వలేదు.
త్రివిక్రంతో కూడా మాటలు జరిగాయని అప్పట్లో టాక్. మొత్తానికి ఇప్పుడు అందుకున్న తాజా సమాచారం ప్రకారం అఖిల్ శ్రీను వైట్ల తో సినిమా చేస్తున్నట్లు తెలుస్తుంది. వైట్లతో తీస్తే ఓవర్సీస్ లో మంచి కలెక్షన్స్ మరియు అఖిల్ కి ” ఏ ” సెంటర్ జనాలకి దగ్గర అవుతాడని నాగార్జున ఆలోచన. మొత్తానికి అఖిల్ తన రెండో సినిమా వైట్ల తో ఖరారు అయినట్లే.


Previous
Next Post »