0

పోలిస్ స్టేషన్ లో తోడ కొట్టిన అమ్మాయి

     

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ యువతి ఓ యువకుడిపై దాడికి పాల్పడింది. అచ్చు తప్పులనుకుంటున్నారా..? అదేం కాదు ఇది నిజమే. యువతి ఓ యువకుడిపై దాడి చేసింది. అంటే ఏదో వార్నింగ్ ఇచ్చి వదిలేసిందనుకుంటున్నారా..? కాదుకాదు.. పంచ్ లతో పచ్చడి చేసింది. అయ్యెరామ. ఆ యువతి చేసిన పనికి ఏకంగా పోలీసులే నివ్వెరపోయారంటే.. అతిశయోక్తి కాదు. అయితే ఇదంతా ఎక్కడ జరిగిందంటారా..? ఈ ఘటనకు సాక్షంగా నిలిచింది పోలీసు స్టేషన్ కావడం మరో విషయం. ఇదెక్కడి చోద్యం అనుకుంటున్నారా..? అయితే ఈ ఘటన పూర్వాపరాలు తెలిసిన వారు మాత్రం ‘‘వాహ్ బేటీ.. తుజ్ మే యే హిమ్మత్ దేఖ్ కే హమే ఝాన్సీ లక్ష్మీభాయి యాద్ అయీ’’.. ( నీ లోని ధైర్యం చూసి మాకు ఝాన్సీ లక్ష్మీభాయి గుర్తుకువస్తుందని) అంటున్నారు..
   

ప్రతిరోజు స్కూల్ వేళ్లే దారిలో వేచిన తనను వేధిస్తున్న పోకిరి ఆ విద్యార్థిని లైట్ గా తీసుకుంది. అయితే అమె మౌనంతో పోకిరి రెచ్చిపోయాడు. స్కూల్ కు వెళ్తుంటే.. సైకిల్ అడ్డుపెట్టి మాట్లాడేందుకు ప్రయత్నించాడు. అంతటితో ఆగలేదు. అసభ్య పదజాలంతో దూషించేవాడు. ఒక రోజు స్నేహితుడితో కలసి బైక్ పై వచ్చిన అసభ్య పదజాలంతో దూషించాడు. అంతే కోపంతో ఊగిపోయిన యువతి వారి బైక్ తాళం లాగేసుకుంది. వారిలో పోలీసుకుల అప్పగించాలని నిర్ణయించుకుంది. వెంటనే తన తండ్రికి సమాచారం అందించింది.


వారిలో ఒకడు పరారీ కాగా, అసలైన పోకిరినీ మాత్రం విద్యార్థిని వదలలేదు. వాటి పోలీసు స్టేషన్ కు రప్పించింది. వాడు పోలిస్ స్టేషన్ కు రాగానే.. ఇన్నాళ్లు వాడి మాటలు భరించిన సహనంగా వుంటూ మౌనంగా తన దారిన వెళ్లిన విద్యార్థినిలో కోపం కట్టలు తెంచుకుంది. అంతే.. పోకిరిన చావ చితక కోట్టింది. పోలీసులు సలహాతో పోకిరితో చెప్పుతో బుద్ది చెప్పింది. ఇక మరెప్పుడూ ఇలాంటి పనులు చేయనని పోకిరి ఆ అమ్మాయి కాళ్లు పట్టుకున్నారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని ఫిలిబిత్‌లో జరిగింది. 
Previous
Next Post »