0

సూపర్ స్టార్ కి, పవర్ స్టార్ కి మధ్య గొడవేంటి?

rajinikanth
తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ కు, పవర్ స్టార్ కు అంతర్యుద్ధం మొదలైందట. ఇక వివరాల్లోకి వెళితే రజనీకాంత్ ఇటీవల నటించిన లింగా సినిమా ఘోర పరాజయాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాతో రజనీ ఏ సినిమాకీ పడనన్ని ఇక్కట్లను పడ్డారు. అయితే కొంతమంది బయ్యర్లు ఏకంగా రజనీ ఇంటి ముందే ధర్నాకు దిగారంటే లింగా వివాదం ఎంతగా ముదిరిందో అర్ధం అవుతుంది. ఇక లింగా సినిమాను కొని భారీగా నష్టపోయి, ఆందోళనలతో సంతృప్తి చెందని సింగాలరేవన్ అనే పంపిణీదారుడు ఆ చిత్రానికి స్పూఫ్ ను నిర్మిస్తూ అందులో హీరోగా పవర్ స్టార్ ను ఎంచుకున్నారట.
కాగా లింగా స్పూఫ్ ఏమిటి, అందులో పవర్ స్టార్ నటించడమేమిటనే అనుమానం, ఆశ్చర్యం కలగడం సహజమే. అయితే ఇక్కడ పవర్ స్టార్ అంటే మన తెలుగు సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాదు, కోలీవుడ్ లో తమిళ కామిడీ స్పూఫ్ లు చేసే పవర్ స్టార్ శ్రీనివాసన్ అట. ఇక ఈ కోలీవుడ్ పవర్ స్టార్ ను ఉపయోగించుకుని తమిళ బయ్యర్లు రజనీకాంత్ పై ఉన్న కోపాన్ని బహిర్గతం చేసేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం.

Previous
Next Post »