0

రాజమౌళికి మొదటి బుల్లెట్ దించేశాడు: రోబో2 రికార్డ్

రాజమౌళికి మొదటి బుల్లెట్ దించేశాడు: రోబో2 రికార్డ్
ఇప్పటి వరకూ ఎవ్వరూ ఊహించని విధంగా కలెక్షన్స్ సునామీ క్రియేట్ చేస్తున్న మూవీ బాహుబలి. మరి ఇంతటి బాహుబలి మూవీని తెరకెక్కించిన దర్శకుడు రాజమౌళి సైతం... సౌత్ ఇండియాలోనే నెంబర్ వన్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పటి వరకూ ఆ లిస్ట్ లో శంకర్ మొదటి స్థానంలో ఉన్నాడు. శంకర్ ని మించి రాజమౌళి ముందుకు రావటం అనేది, ముఖ్యంగా కోలీవుడ్ ఇండస్ట్రీకి అస్సలు మింగుడు పడటం లేదు. అయితే ఒకవిధంగా ఈ విషయాన్ని శంకర్ సైతం ఒప్పుకోవటానికి సిద్ధపడటం లేదు.
కచ్ఛితంగా రికార్డ్స్ ని రికార్డ్స్ తోనే లెక్క సరిచేయాలనుకుంటున్నాడు శంకర్. అందులోని భాగంగానే శంకర్ తన అప్ కమింగ్ మూవీ రోబో2 మూవీకి సంబంధించిన పనులను వేగవంతం చేశాడు. మూవీని స్టార్ట్ చేశాడో..లేదో..అప్పుడు ఓ రికార్డ్ ని నమోదు చేసి... ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్నాడు. ప్రతి బాహుబలి ని పక్కన పెట్టి..రోబో2 గురించి మీడియా మాట్లాడుకోవటం మొదలు పెట్టింది.
ఆ వివరాల్లోకి వెళితే, రజనీకాంత్ హీరోగా దర్శకుడు శంకర్ సృష్టించిన టెక్నికల్ వండర్ రోబో. ఈ సినిమాకు సీక్వెల్‌ని రూపొందించాలని గత కొన్ని నెలలుగా శంకర్ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమా నిర్మాణం దాదాపు మూడేళ్లపాటు సాగనుందని, సాంకేతిక అద్భుతంగా రూపొందనున్న ఈ చిత్రానికి దక్షిణభారత చలనచిత్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా 27 మంది అసిస్టెంట్ డైరెక్టర్‌లు, 10మంది ప్రొడక్షన్ మేనేజర్‌లు పనిచేయనున్నారనే క్లియర్ టాక్స్ వినిపిస్తున్నాయి.
Previous
Next Post »