0

విద్యార్ధుల ముందే టీచర్లు.. ఏమిటా పని..?

విద్యార్ధులకు పాఠాలు చెప్పాల్సిన టీచర్లే వారి ముందు విచక్షణారహితంగా ప్రవర్తిస్తే ఇక భావి తరాలు ఎటువైపు నడుస్తాయి అనే అనుమానం కలుగుతుంది ఈ సంఘటన గురించి తెలిస్తే. వివరాలలోకి వెళితే మెదక్ జిల్లా రామాయంపేట మండలం నార్లాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్, సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయుడు లక్ష్మణ్ మధ్య కొద్ది రోజులుగా వివాదం నెలకొంది.
తాజాగా స్కూల్ కు వచ్చిన ఇద్దరు కార్యాలయంలో చిన్నపాటి విషయమై గొడవకు దిగారు. ఆ తరువాత బూతులు తిట్టుకున్నారు. అంతటితో ఆగకుండా చెప్పులతో ఒకరినొకరు కొట్టుకున్నారు. విద్యార్ధులు, ఇతర టీచర్ల ముందే ఇదంతా జరగడంతో వారంతా షాక్ తో చూస్తూ ఉండిపోయారు. చివరకు గ్రామస్థుల జోక్యంతో సమస్య సద్దుమనిగినప్పటికీ, ఆ తర్వాత ఇద్దరు టీచర్లు రామాయంపేట పోలిస్ స్టేషన్ లో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. వారి ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Previous
Next Post »