బిక్షం వేయడానికి ఇష్టంలేకనో.. లేదా నిజంగా నగదు లేకనో బిక్షమేయడానికి నిరాకరిస్తే కుదరదు. వెంటనే స్వైపింగ్ మిషన్లు మీ ముందు ప్రత్యక్షమవుతాయి. బిక్షమేసే మొత్తం ఇందులో స్వైప్ చేయాలని బిక్షగాళ్ళు కోరే రోజులు వచ్చేశాయి. ఇదే అమెరికాలోనో లేక ఆస్ట్రేలియాలోనో అనుకుంటున్నారా.. ఎంత మాత్రం కాదు. సాక్షత్తు హైదరాబాద్‌లో.. మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోనే.
ఓ యాచకుడు అందివచ్చిన సాంకేతికతను తానూ వినియోగించుకుని సరికొత్త పద్ధతిలో యాచించడం మొదలు పెట్టాడు. నగరంలోని హైటెక్ సిటీలో జరిగిందీ ఘటన. ఆ ప్రాంతంలోని రద్దీ కూడలిలో రెడ్ సిగ్నల్ పడిన వెంటనే ఓ కారు వద్దకు వెళ్లి డబ్బులు దానం చేయమని అడిగాడు.
పర్సు చూసుకున్న మహిళ డబ్బులేవని, ఏటీఎమ్ కార్డులు మాత్రమే ఉన్నాయని చెప్పింది. అంతే వెంటనే మనోడు తన సంచిలో నుంచి స్వైపింగ్ మిషన్ బయటకి తీశాడు. దీంతో కారులో ఉన్నవారందరూ ఆశ్చర్యపోయారు.
Sign up here with your email
ConversionConversion EmoticonEmoticon