బ్రహ్మంగారు చెబుతున్న సంఘటనలు ఒక్కొక్కటిగా జరుగుతున్నాయి. వేపచెట్టుకు పాలు కారుతాయని.. పంది కడుపున మేకపిల్ల పుడుతుందని ఇలా సంఘటనలు చాలా జరిగాయి. ఇది ఆయన చెప్పారో లేదో తెలియదుగానీ ఓ మహిళ కడుపున పాము పిల్ల పుట్టింది. భయపడ్డ గ్రామస్తులు వెంటనే దానిని చంపి ఖననం చేసేశారు. వివరాలిలా ఉన్నాయి.
ఆదిలాబాద్ జిల్లా కెరమెరి మండలం సాంగ్వి పంచాయతీ పరిధిలోని కెలి(బి) కొలాంగూడలో గురువారం వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన కవితాబాయి మొదటి కాన్పులో ఓ పాప జన్మించింది. వారం రోజుల తర్వాత ఆ పాప మరణించింది. ఇక రెండో కాన్పులోనైనా అమ్మాయో.. అబ్బాయో పుడుతుందని సంబరపడ్డ ఆ దంపతులకు దురాశే మిగిలింది.
శనివారం పాము పిల్లకు జన్మనిచ్చినట్లు ఆమె కుటుంబీకుల ద్వారా తెలిసింది. వెంటనే ఆ పామును చంపేసి గిరిజన సంప్రదాయ పద్ధతిలో ఖననం చేశారు. అయితే.. ఈ సంఘటన చోటుచేసుకుని ఆరు రోజులు గడుస్తున్నా గ్రామానికి అరిష్టమని భావించి అక్కడి వారు వెలుగులోకి రానివ్వలేదు.
Sign up here with your email
ConversionConversion EmoticonEmoticon