0

ఓ వ్యక్తి మతిమరుపుతో.. ఆ కుటుంబం చచ్చిబతికింది..!

fear
మతిమరుపు అన్నది మనిషికి సాధారణమే. అప్పుడప్పుడు ఆ మతిమరుపు ప్రాణాలమీదకు తెస్తుంది. అయితే, రివర్స్ అయింది. ఓ వ్యక్తి మతిమరపు పక్కింటి వాడి ప్రాణాలమీదకు తెచ్చింది. ఏ దెయ్యమో.. భూతమో తమ ఇంటిని ఆవహించాయని భయపడే విధంగా చేసింది. దీంతో ఆ కుటుంబసభ్యులు బెంబేలెత్తిపోయారు. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం.

కర్ణాటక లోని ఉడిపి జిల్లాలో ఉన్న వండ్సే గ్రామంలో గోవింద అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ఓ రోజు ఆయన నివసించే ఇంటి పెరట్లో ఉన్న కొబ్బరి చెట్టు పరిసర ప్రాంతాల నుంచి చిన్నపిల్లవాడి ఏడుపు వినిపించింది. దీంతో గోవింద ఆశ్చర్యపోయాడు. పెరడు మొత్తం వెతికాడు. కాని పిల్లవాడి ఏడుపు ఎక్కడి నుంచి వస్తుందో అర్ధం కాలేదు. అలా ఒక్కసారి కాదు అనేక సార్లు పిల్లవాడి ఏడుపు శబ్దం వినిపించింది. దీంతో గోవింద కుటుంబం ఆశ్చర్యంతో పాటు భయపడిపోయింది. పరిష్కారం కోసం జ్యోతిష్కుడిని కలిశారు. భూతాలు ఉండవచ్చనే అనుమానాన్ని వ్యక్తం చేసిన జ్యోతిష్కుడు.. కొబ్బరి చెట్టు వద్ద హోమం చేయాలని చెప్పారు. హోమం చేసేందుకు అన్నీ సిద్దం చేశారు. ఆరోజు కూడా చిన్నపిల్లవాడి ఏడుపు వినిపిస్తూనే ఉన్నది.. ఈ ఏడుపు శబ్దం సాయంత్రం వరకు అలాగే కొనసాగడంతో గోవింద కుటుంబ సభ్యులు గజగజ వణికిపోయింది.

అప్పుడు.. ఆ సమయంలో సీనా పూజారి అనే వ్యక్తి గోవిందుని ఇంటికి వచ్చాడు. సీనా పూజారి కొబ్బరి చెట్టు ఎక్కి కొబ్బరికాయలు దించడం అతని వృత్తి. వచ్చీ రాగానే కొబ్బరి చెట్టు ఎక్కి కొబ్బరికాయలకు బదులుగా.. ఓ ప్లాస్టిక్ కవర్ తీసుకొని కిందకు వాచ్చాడు. తనకు మతి మరుపు ఉందని.. తన సెల్ ఫోన్ ను ప్లాస్టిక్ కవర్ లో పెట్టి చెట్టుపై పెట్టినట్టు.. అది ఎక్కడ పెట్టింది అర్ధంగాక.. తాను కొబ్బరిచెట్టు ఎక్కిన అందరి ఇంటికి వెళ్లి చూశానని చెప్పాడు. తన సెల్ ఫోన్ రింగ్ టోన్ గా చిన్నపిల్లవాడి ఏడుపు శబ్దం పెట్టుకున్నానని చెప్పడంతో.. గోవిందుని కుటుంబం ఊపిరిపీల్చుకున్నది.
Previous
Next Post »