హైదరాబాద్: నగ్నంగా నటించడం ఇబ్బంది కరమే కానీ బావుంటుంది అంటూ వ్యాఖ్యానించారు
హాలీవుడ్ స్టార్ ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్. తన తాజా సినిమా ‘టెర్మినేటర్ జెనిసిస్'
కోసం ఆయన నగ్నంగా నటించారు.
67 ఏల్ల ఆర్నాల్డ్ నటిస్తున్న ఈ చిత్రం టెర్మినేటర్ సిరీస్‌లో
5వ చిత్రం. ముప్పై ఏళ్ళగా వస్తున్న ‘టెర్మినేటర్' సీరిస్ సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం
పడుతున్నారు. నేటికీ ఆ సినిమాలకు ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. అందుకు కథాబలం ఒక కారణమైతే,
అప్పటి నుంచి ఇప్పటి వరకు టెర్మినేటర్ సీరిస్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఆర్నాల్డ్
స్వాజ్‌నెగ్గర్ మరో ముఖ్యమైన కారణం.
మెషీన్‌మెన్ అనే పదానికి ఆయనొక పర్యాయపదం. తాజాగా 'టెర్మినేటర్ జెనిసిస్'తో ప్రేక్షకుల ముందుకిరానున్నారు. అలెన్ టేలర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ సంస్థ ‘టెర్మినేటర్' (మరో సృష్టి) టైటిల్‌తో జూలై 3న తెలుగు ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తుంది. ఇందులో ఆయన టెర్మినేటర్ ఒరిజినల్ టి-800 మోడల్ కనిపించబోతున్నారు.

లీ బైంగ్ విలన్ పాత్రలో
టి-1000 మెడల్ గా కనిపించబోతున్నారు. వయాకామ్ 18 ప్రతినిధులు మాట్లాడుతూ ‘‘ఒక హీరో
30 ఏళ్లుగా ఒకే సినిమా ప్రాంచైజ్‌గా చేస్తూ నటించడం గొప్ప విషయం. హాలీవుడ్‌లో ఆర్నాల్డ్‌తో
పని చేసిన ఏ టెక్నిషియన్‌ని ఆడిగినా ‘ఆర్నాల్డ్ అమేజింగ్' అంటూ ఎంతో గొప్పగా చెబుతున్నారు.
ఈ సినిమా కోసం ఆయన్ని కలవడం వల్ల ఆయన వ్యక్తిత్వం, వృత్తికి ఆయనిచ్చే విలువ, సెన్స్
ఆఫ్ హ్యుమర్ అన్ని తెలిశాయి.
కేవలం సినిమా గురించే కాదు పాలిటిక్స్, కార్స్, ఫ్యాషన్,
ఎన్విరాన్‌మెంట్ ఇలా ఏ అంశం మీదైనా ఆయన మాట్లాడగలరు. ఆయన నటించిన ‘టెర్మినేటర్ జెనిసిస్'ను
టెర్మినేటర్(మరోసృష్టి) టైటిల్‌తో వయాకామ్ ద్వారా తెలుగులో విడుదల చెయ్యడం ఆనందంగా
ఉంది. ఆర్నాల్డ్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకుల్ని ముగ్దుల్ని చేస్తుంది.
ఐమాక్స్ త్రీడీ, డిజిటల్ త్రీడీ, 2డి థియేటర్స్‌లో జూలై 3న తెలుగు, హిందీ, తమిళం,
ఇంగ్లీష్ భాషల్లో విడుదలచేస్తున్నాం అని తెలిపారు.
Sign up here with your email
ConversionConversion EmoticonEmoticon