తప్ప తాగింది.. శ్రుతి మించింది. కంట్రోల్ తప్పి కారు నడిపించింది. వేగంగా కారు నడుపుతూ వాహన దారులకు ముచ్చెమటలు పట్టించింది. ఒక బైక్ ని ఒక తోపుడు బండిని ధ్వంసం చేసి తుర్రు మంది. రాత్రి హైదరాబాద్ జుబ్లిహిల్ల్స్ ప్రాంతం లో ఒక యువతి పీకల దాక మందు కొట్టి నానా బీబత్సం సృష్టించింది. కేబిర్ పార్క్ వద్ద మరో కారును ఓవర్ టేక్ చేయబోయి ఐస్ క్రీం బండిని, మరో బండిని డీ కొట్టింది. ఈ ఘటనలో ఐస్ క్రీం బండి ఓనర్ మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రం గా గాయపడింది. గాయ పడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు పోలీసులు. డాక్టర్ రెడ్డీస్ పేరుతో కారు రిజిస్టర్ అయినట్లు పోలీసులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంబించారు.
Sign up here with your email
ConversionConversion EmoticonEmoticon