ఆ గ్రామాల ప్రజలకు పిల్లలంటే లెక్కలేదు. వారి ప్రాణాలతో చెలగాటం
ఆడతారు. దాదాపుగా నాలుగు అంతస్థుల ఎత్తు నుంచి వారిని కిందకు జారవిడుస్తారు..
ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏడు శతాబ్దాలుగా జరుగుతోంది. ఒకరు కాదు ఇద్దరు కాదు
కొన్ని వేలమంది ఇలానే చేస్తారు.. మరి ఆ బిడ్డలు బతుకుతారా...? సాధ్యమా..? ఎలా?
తెలుసుకోవాలంటే.. మహారాష్ట్ర లేదా కర్ణాటక వెళ్ళాల్సిందే..
మహారాష్ట్రలోని బాబా ఉమర్ దర్గా, కర్ణాటకలోని నాగ్రాలా గ్రామంలోని
దిగమేశ్వర గుడిలో ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. హిందువులు, ముస్లీంలు కలసిమెలసి
ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇలా 700 సంవత్సరాలుగా అక్కడి హిందూ, ముస్లిం ప్రజలు
వీటిని నిర్వహిస్తున్నారు. అయితే ఇక్కడున్న ఓ ఆచారం చూస్తే మనకు వళ్ళు గగుర్పొడుస్తుంది.
నెలల పసికందు మొదలు రెండు సంవత్సరాల వయసులోపు పిల్లలందరినీ నాలుగు
అంతస్థుల పైనుంచి కిందకి పడేస్తారు. ఆ గుడిలో ఇలా పిల్లల్ని పైనుండి పడేయడంవల్ల
వారికి శక్తి, ఆరోగ్యం కలుగుతాయని అక్కడ వారి నమ్మకం. ఇప్పటికీ పడేస్తూనే
ఉన్నారు. గాలిలోనే వారు భయపడే అవకాశం ఉంది. కానీ అలా పడేసిన పిల్లలకు ఏమి
కాదనేది జనం నమ్మకం. వారిని పట్టుకోవడానికి కింద పట్టుకునే వాళ్లు
ఉంటారనుకోండి.
వారి చేయి జారితే... అమ్మో ఊహించడానికే లేదు. అయినా జనం ఆ నమ్మకాన్ని
నేటికీ పాటిస్తున్నారు. అయితే పిల్లలకు శారీరక, మానసిక బాధలు కలుగుతాయనే
ఉద్దేశంతో, దీన్ని నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ, ప్రతీ యేటా ఈ ఉత్సవం
జరుగుతూనే ఉంది.
Sign up here with your email
ConversionConversion EmoticonEmoticon