బాహుబలి మేనియా ఇంతింత కాదయా ! లెక్కలేనన్ని సంచలనాలను ,వివాదాలను
సృష్టిస్తోంది . తాజాగా వరంగల్ లోని సుషీల్ థియేటర్ స్క్రీన్ ని చించేశారు ప్రభాస్
అభిమానులు . బాహుబలి చిత్రాన్ని వరంగల్ జిల్లా కేంద్రం లోని సుశీల్ థియేటర్ లో ప్రదర్శిస్తున్న
సమయంలో అభిమానుల మద్య తీవ్ర వివాదం చెలరేగింది . పెద్ద ఎత్తున ప్రభాస్ అభిమానులు సినిమా
రన్ అవుతున్న సమయంలో ఈలలు వేస్తూ గోల గోల చేసారు . అయితే ప్రభాస్ అభిమానుల్లో రెండు
వర్గాలు కావడంతో ఒకరిని మించి మరో గ్యాంగ్ రెచ్చిపోయి నినాదాలు చేస్తూ చివరకు కొట్టుకునే
వరకు వెళ్లారు . దాంతో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి . అదే సమయంలో థియేటర్
స్క్రీన్ ని చించేశారు అభిమానులు .
Sign up here with your email
ConversionConversion EmoticonEmoticon