రాజమౌళి తాజా చిత్రం ‘బాహుబలి' విడుదలైన రోజు నుంచి ఒకటే ప్రశ్న నెట్ జనులను, సామాన్యులను ఆలోచనలో పడేస్తోంది. అది మరేదో కాదు... ‘బాహుబలి'ని కట్టప్ప ఎందుకు చంపాడు? అనేదే. ఈవిషయమై సోషల్ మీడియాలో నిరంతరం చర్చ నడుస్తోంది. అయితే రీసెంట్ గా ఆ చిత్రం రచయిత విజియేంద్ర ప్రసాద్..ఇచ్చిన టీవి ఇంటర్వూలో ఇంకో కొత్త ఊహను అభిమానుల్లోకి వదిలారు.
విజియేంద్రప్రసాద్ మాట్లాడుతూ... "మీరు అసలు కట్టప్ప..బాహుబలిని చంపారని ఎందుకు అనుకుంటున్నారు ? అతన్ని కేవలం పొడిచాడు అంతే." ఇది విన్న అభిమానులు...అంటే కట్టప్ప పొడవటం వల్ల బాహుబలి చనిపోలేదనే కంక్లూజన్ కు వస్తున్నారు. బాహుబలిని ...రానా చంపి ఉంటాడంటున్నారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం రమ్యకృష్ణ సూచన మేరకు...బాహుబలిని కట్టప్ప చంపేస్తాడని తెలుస్తోంది.
బాహుబలిని కట్టప్ప ఎందుకు హతమార్చాడు.. భళ్లాలదేవ ఎలా రాజయ్యాడు.. శివగామి అందుకు సహకరించిందా.. దేవసేనను సంకేల్లతో ఎందుకు బంధించారు.. తండ్రి గురించి తెలుసుకున్న శివుడు తర్వాత ఏం చేస్తాడు.. అవంతికకు దేవసేనకు సంబంధం ఏమిటి.. ప్రస్తుతం ఈ ప్రశ్నలన్నీ బాహుబలి సినిమా చూసిన ప్రేక్షకులను తొలిచేస్తున్నాయి. వీటన్నిటికీ సమాధానంగా బాహుబలి ది కంక్లూజన్ పార్ట్ రానుంది.
బాహుబలి సినిమా చివర్లో ‘బాహుబలి'ని నేనే చంపానని కట్టప్ప చెప్పటమే దీనికి కీలకం అయ్యింది. సినిమా ఘన విజయం సాధించటంతో జనం అందరూ దీనిపై చర్చ మొదలెట్టారు . ముఖ్యంగా సోషల్ మీడియాలో విపరీతమైన చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా నెట్ జనులు జోకులు, కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.
‘బాహుబలి'ని కట్టప్ప ఎందుకు చంపాడు? అనే ప్రశ్న సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలలో హల్‌చల్ చేస్తోంది. దీనిని ‘క్వశ్చన్ ఆఫ్ ది ఇయర్'గా చెప్తూ దానికి తమకు నచ్చిన సమాధానాలతోపాటు ఫోటోలను కూడా పెడుతున్నారు.
Sign up here with your email
ConversionConversion EmoticonEmoticon