0

మన్మోహన్ సింగ్ సెక్యూరిటీపై చెంప చెళ్లుమనిపించింది (వీడియో)

మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సెక్యూరిటీపై ఓ మహిళ చేయిచేసుకోవడం హాట్ టాపిక్‌గా మారిపోయింది. పోలీసులందరూ చూస్తుండగానే ఓ టర్కిష్ మహిళ సెక్యూరిటీ గార్డుపై చేయిజేసుకుందని తెలిసింది. ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో హల్‌చల్ చేస్తోంది. భద్రతా కారణాల రీత్యా సెక్యూరిటీ గార్డు ఆమెను అడ్డుకున్నారు. కానీ తనను లోపలికి పంపించి తీరాల్సిందేనని ఆ మహిళ వాగ్వివాదానికి దిగడం.. ఆపై గార్డుపై చేయిజేసుకోవడం జరిగిపోయింది. 

పలువురు పోలీసు అధికారుల ముందే ఈ ఘటన జరిగింది. సదరు మహిళ ఢిల్లీలో ఓ పుస్తకావిష్కరణ నిమిత్తం వచ్చారని సమాచారం. ఈ వీడియోను ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ఫోటోగ్రాఫర్ తీశారు. వీడియోలో ఉన్న ఫుటేజ్ పరిశీలిస్తే... ఆ మహిళ గార్డుతో వాగ్వాదానికి దిగింది. తనను లోనికి పంపించాలని డిమాండ్ చేసింది. కాసేపటి తర్వాత ఆమె అతనిపై చేయిచేసుకుంది. ఆమె పైన ఏమైనా చర్యలు తీసుకున్నారన్నది తెలియాల్సి ఉంది. 'ఆమె కొడతానని బెదిరించి, అన్నంత పని చేసిందని ఫోటోగ్రాఫర్ చెప్పారు.


           
Previous
Next Post »