హోటల్స్, మాల్స్, క్లాత్ షోరూమ్స్ లో సీసీ కెమెరాలు అమర్చుతారని
తెలుసు. ఎందుకంటే వందలు వేల మంది వచ్చివెళ్ళే ప్రాంతాలు కాబట్టి ఎటువంటి అవాంచనీయ సంఘటనలు
జరగకూడదనే ఉద్దేశ్యంతో ముందు జాగ్రత్తగా వీటిని అమర్చుతారు. అయితే, ఇటీవల కాలంలో బట్టలు
మార్చుకునే ట్రయిల్ రూమ్ లలో కొందరు ఉద్దేశ్యపూరకంగా రహస్య కెమెరాలు అమర్చి బట్టలు
మార్చుకుంటున్న దృశ్యాలను షూట్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్న సంఘటనలను మనం చూస్తూనే
ఉన్నాం. వారిని పట్టుకొని జైల్లో పెడుతున్నప్పటికీ ఇంకా అటువంటి సంఘటనలు ఇంకా జరుగుతూనే
ఉన్నాయి.
కోచిలోని ఓ ప్రముఖ షోరూం కు ఉన్నత కుటుంబాలకు చెందిన
మహిళలు, యువతకు ఎక్కువగా బట్టలు కొనేందుకు వస్తుంటారు. అయితే, నెల రోజుల క్రితం ఆ షోరూం
లో నెలరోజుల క్రితం సేల్స్ మెన్ గా చేరిన సంజీవ్ ట్రయిల్ రూమ్ లో మొబైల్ కెమెరాను అమర్చాడు.
ఈ విషయాన్నీ ఓ మహిళ గుర్తించడంతో అతనిని ఉద్యోగం నుంచి తొలగించడమే కాకుండా పోలీసులకు
అప్పగించినట్టు తెలుస్తున్నది.
Sign up here with your email
ConversionConversion EmoticonEmoticon