బాహుబలి
రికార్డుల మోత .. పాత మాట అయిపోయింది. ఇక నుంచి బాహుబలి రెండో పార్ట్‌పై దృష్టి సారించాల్సిన
టైమొచ్చేసింది. రాజమౌళి, ప్రభాస్, రానా అండ్ గ్యాంగ్ ఇప్పట్లో ఈ ఆనంద హేల నుంచి
తేరుకోవడం కుదరదు కాబట్టి .. ఇక బాహుబలి 2లో ఏం జరగబోతోందో మనమే ఊహించాల్సిందే.
అయితే లేటెస్టు అప్‌డేట్ ప్రకారం బాహుబలి రెండో భాగం కథ ఇంకా పూర్తి స్థాయిలో రెడీ
కాలేదు. బాహుబలి తండ్రి, స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే కథ కోసం కసరత్తులు
చేస్తున్నారు. ఎట్టి పరిస్థితిలో ఈ సినిమా రెండో భాగం కథను శరవేగంగా పూర్తి చేయడానికి
ఆయన మూలికల్ని వెతుకుతున్నారని సమాచారం. అంతే కాదండోయ్ బాహుబలి: దఇ బిగినింగ్‌లో
కాళికేయ లాంటి ఓ వికృత రాక్షస రూపాన్ని క్రియేట్ చేసిన సదరు రచయిత ఈసారి ఓ భయంకర
మైన పది తలల రాకాశి సర్పాన్ని క్రియేట్ చేయనున్నాడని వినిపిస్తోంది.
హాలీవుడ్‌లో
ఇప్పటికే ఇలాంటి ప్రయోగాలు వచ్చేసినా .. రాజమౌళి దృష్టి కోణంలోంచి ఈ రూపం సరికొత్తగా
ఆవిష్కరించే ప్రయత్నం జరుగుతోందిట. అంతేనా ఈ రూపంలో అంతర్లీనంగా రావణాసురుడి
గెటప్ కూడా ఇమిడి ఉంటుందని చెబుతున్నారు. ఆ రూపం అచ్చం ఎలా ఉంటుంది అంటే.. ఇదిగో
ఇలా ఉంటుందన్నమాట!
Sign up here with your email
ConversionConversion EmoticonEmoticon