0

అబ్దుల్ కలాం విషయంలో తప్పు చేసిన అనుష్క

Anushka-Sharma
బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న పురస్కార గ్రహీత అబ్దుల్ కలాం మృతిపై తప్పుగా స్పందించి విమర్శల పాలవడమే కాకుండా సోషల్ మీడియా వార్తల్లో దోషిగా నిలిచింది. తాజాగా మరణించిన అబ్దుల్ కలాం పేరును ట్విట్టర్ లో తప్పుగా రాసి ఆమె విమర్శలపాలైంది. ఆమె తన ట్విట్టర్ లో ‘ఏబీజే కలాం ఆజాద్ మరణవార్త నాకు ఎంతో భాద కలిగించింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేసింది.

తరువాత తప్పు తెలుసుకుని ఆ ట్వీట్ తొలగించింది. ఆ తరువాత కూడా ‘ఏపీజే కలాం ఆజాద్’ అని తప్పుగా రాసింది. చివరకు మూడోసారి ఆయన పేరును సరిగా రాసింది. దీంతో దేశం గర్వించదగ్గ అబ్దుల్ కలాం పేరును తప్పుగా రాసిన అనుష్క శర్మపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలతో పాటు సెటైర్లు కూడా పేల్చారు. మూడు సార్లు ప్రయత్నించి కలాం పేరు కరెక్టుగా రాసినందుకు అనుష్కకు అభినందనలు, ఇదో గొప్ప విజయం అని ఒకరు కామెంట్ చేశారు. అనుష్కకు జీకే పాఠాలు అవసరమని మరొకరు ట్వీట్ చేశారు. ప్రముఖుల పేర్లను రాసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని మరొకరు హెచ్చరించారు. అలాగే అనేక విమర్శలు ఆమెకు ట్వీట్ల రూపంలో ఎదురయ్యాయి.
Previous
Next Post »