కహానీ
ఘర్ ఘర్ కీ అనే హిందీ ధారావాహికలో నటించిన ప్రీతి గుప్తా బాలీవుడ్‌లో కూడా సపోర్టింగ్
క్యారెక్టర్లు చేసింది. 'అన్‌ఫ్రీడమ్' అనే సంచలన చిత్రంలో ఆమె నటించి వార్తల్లోకి
ఎక్కింది. లెస్బియనిజమ్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రంలో పలు బోల్డ్ సీన్స్ వున్నాయి.
ఆ సీన్స్‌లో నగ్నంగా నటించడానికి కూడా ప్రీతి వెనుకాడలేదు. కాకపోతే ఈ చిత్రాన్ని ఇండియాలో
ప్రదర్శించడానికి వీల్లేదని తేల్చేసారు. ఇక్కడ ప్రదర్శనకి వీలు లేకుండా నిషేధించారు.
కాకపోతే ఆ సినిమాలోని నగ్న సన్నివేశాలన్నీ ఒక వీడియోగా రూపొందించి ఇంటర్నెట్‌లో పెట్టారు.
మరోవైపు ప్రీతి నగ్న చిత్రాలు కూడా కొన్ని ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమయ్యాయి.
ఇవి తనవి కాదంటూ బుకాయించకుండా, ఇది తన హక్కులకి భంగం
కలిగించడమేనంటూ ప్రీతి గుప్తా మండిపడుతోంది. అన్‌ఫ్రీడమ్‌లాంటి సినిమాల్ని బ్యాన్
చేయడం కాదని, ఇలాంటి చర్యలని నిషేధించాలని చెప్పింది. సమాజంలో వున్న దాని గురించే తాము
సినిమాలో చూపించినా కానీ దానిని బ్యాన్ చేయడమేంటో తనకి అర్థం కాలేదని, ఇకనైనా కాస్త
అడ్వాన్స్‌డ్‌గా ఆలోచించాల్సిన అవసరం వుందని, ఆర్ట్‌ని ఆర్ట్‌లా చూసే పరిపక్వత రావాలని
ప్రీతి పేర్కొంది.
Sign up here with your email
ConversionConversion EmoticonEmoticon