సౌత్ ఇండస్ట్రీలో తమిళ సినిమా ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడి హీరోలు అన్ని ఇండస్ట్రీల్లోనూ ఫేమస్. ఉదాహరణకు మన దగ్గరే తీసుకోండి.. రజినీ మొదలుకొని కమల్, విక్రమ్, సూర్య నిన్నమొన్నటి కార్తి వరకు అందరి సినిమాలు తెలుగులోనూ బాగా ఆడతాయి. కానీ మన హీరోలకు, సినిమాలకు మిగిలిన ఇండస్ట్రీల్లో అంత సీన్ లేదు. కానీ ఇప్పుడు బాహుబలి అందరి లెక్కలు సరిచేస్తుంది. అందరి ప్రశ్నలకు సమాధానం చెబుతుంది. తెలుగుతో పాటు అన్ని ఇండస్ట్రీల్లోనూ బాహుబలి హవా నడుస్తుంది ఇప్పుడు. తాజాగా హిందీలోనూ ఈ చిత్రం రికార్డులు సృష్టిస్తూ ముందుకు సాగుతుంది. బాలీవుడ్ లో తొలి 50 కోట్ల సినిమాగా ఉత్తరాదిన సరికొత్త చరిత్రకు నాందీపలికింది బాహుబలి. గతంలో ఏ సౌత్ డబ్బింగ్ హిందీలో ఈ స్థాయి సంచలనం సృష్టించలేదు. బాహుబలి కూడా ముందు 40 కోట్లు దాటితే చరిత్రే అనుకున్నారు.. కానీ ఇప్పుడు ఈ సినిమా జోరు చూస్తుంటే మరో 20 కోట్ల వరకు కలెక్ట్ చేసే సత్తా కనిపిస్తుంది. మొత్తంగా బాలీవుడ్ లో మన తెలుగు జెండా పాతి.. సౌత్ అంటే తమిళ్ ఇండస్ట్రీ మాత్రమే కాదు.. తెలుగు కూడా అని తెలియజేసింది మన బాహుబలి.
Sign up here with your email
ConversionConversion EmoticonEmoticon