0

లిప్ లాక్ కోసం 36 టేక్ లు తీసుకున్నారా?


ఒకప్పుడు ఎక్స్ పోజింగ్ అంటేనే ఒకటికి పది సార్లు ఆలోచించే మన దక్షిణాది చిత్ర సీమ ఇప్పడు అంతా మారిపోయింది. అందాల వడ్డింపే కాదు హీరో, హీరోయిన్ల మధ్యన రొమాన్స్ కూడా ఇప్పుడు కామన్ గా మారిపోయింది. అయితే ప్రస్తుతం కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తున్న సీన్స్ ఏవంటే ముఖ్యంగా లిప్ టు లిప్ కిస్ సీన్స్ అనే చెప్పాలి. ఇటీవలి కాలంలో ఇది కామన్ అయిపోయింది.
అయితే ఇలాంటి హాట్ సన్నివేశాలను తెరపై చూసినప్పుడు భలే ఎంజాయ్ చేస్తాం. కానీ సీన్ లో ఉన్నవారికి తెలుస్తుంది అసలు పరిస్థితి ఏంటనేది. ఇప్పడు ఇక్కడ కూడా ఓ జంట లిప్ లాక్ కోసం ఏకంగా 36 టేక్ లు తీసుకొని ఔరా అనిపించారు. త్రిష ఇల్లన నయనతార మూవీ కోసం జీవీ ప్రకాశ్, మనీషా యాదవ్ లు లిప్ లాక్ సీన్ కోసం 36  సార్లు అధర చుంబనం చేయాల్సి వచ్చిందట.
అయితే మొదట్లో కాస్త లిప్ సింక్ చేయలేక చాలా ఇబ్బంది పడ్డారట. కానీ ఆ సీన్ చిత్రంలో కీలకం కావడంతో డైరెక్టర్ తనకు కావాల్సింది వచ్చే వరకు అస్సలు వదిలి పెట్టలేదట. దీంతో మొత్తంగా 36 టేకులు తినాల్సి వచ్చిందట. మరి ఆన్ సెట్స్ లో చివరికి 'తినగా తినగా వేము తియ్యగానుండు' అన్న రీతిలో రెచ్చిపోయిన ఈ యువ జంట.. వెండి తెరపై ఎలా రక్తి కట్టిస్తారో అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం కోలీవుడ్ లో ఇదే హాట్ టాపిక్ గా మారింది.
Previous
Next Post »