ప్రాణాలకు
పోరాడుతున్న పాకిస్థాన్ బాలుడికి ఓ తెలుగింటి బిడ్డ తన గుండెను దానం చేసి
ప్రాణాలను నిలిపాడు. వివరాల్లోకి వెళితే.. వివరాల్లోకి వెళితే... పాకిస్థాన్ వంశావళి ప్రాంతానికి చెందిన ఓ
కుటుంబం దుబాయ్‌లో నివసిస్తోంది. ఆ కుటుంబంలోని ఓ బాలుడి గుండె సాధారణ స్థితి
కంటే, పెద్దదిగా ఉండడంతో సమస్యలు తలెత్తాయి. గుండెను మార్చితేగాని ప్రాణాలు
దక్కవని వైద్యులు చెప్పడంతో, అవయవదాతల కోసం అన్వేషణ చేశారు.
అప్పుడు
రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన వైష్ణవ్ అనే బాలుడు హైదరాబాద్‌లో ఉన్నట్టు
తెలిసింది. దీంతో ఆ బాలుడి తల్లిదండ్రులను సంప్రదించగా, కన్నబిడ్డ అవయవాలను దానం
చేసేందుకు అంగీకరించారు. దీంతో గుండె మార్పిడి చికిత్సను చెన్నైలో చేయాలని
నిర్ణయించారు. ఆ ప్రకారం దుబాయ్‌ను బాలుడిని చెన్నైలోని ఫ్రంటర్ లైఫ్ లైన్
ఆసుపత్రికి తీసుకుపట్టారు. అదే విధంగా హైదరాబాద్‌ను విమానం ద్వారా బాలుడి గుండెను
చెన్నైకి తరలించారు. ఈ గుండెను విజయవంతంగా బాలుడికి అమర్చారు.
Sign up here with your email
ConversionConversion EmoticonEmoticon