0

తెలుగులోనే నటించను అంటున్న తెలుగు హీరోయిన్

టాలీవుడ్ మీద శ్రీదేవి అంతటి అతిలోక సుందరే విసుగు చెందిన సందర్భాలు అప్పట్లో బోలెడు చూసాం, మధ్య కాలం లో ఇలియానా, కాజల్ లాంటి వారు ఇదెక్కడి ఇండస్ట్రీ రా బాబు ఎంతసేపూ హీరో చుట్టూ, హీరోయిజం చుట్టూ నే కథ తిరుగుతుంది అంతకు మించు ఒక్క అంగుళం కుడా కదలదు అంటూ తిట్టిపోసిన సందర్భాలు ఉన్నాయి

హీరోయిన్ ని వ్యాంపుకంటే హీనంగా కేవలం పాటల సమయానికి తీసుకు వచ్చి పంపేసే ఒక ఆటవస్తువు గా చేసేసారు అనేది వీరి వాదన పోనీ వీరంతా ముంబై భామలు ఆసక్తి తో అలా అన్నారు అంటే అనుకోవచ్చు కానీ రీసెంట్ గా హైదరాబాద్ భామ బిందు మాధవి కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసి సంచలనం సృష్టించింది

తెలుగు అమ్మాయి బిందు మాధవి ఆవకాయ బిర్యానీ సినిమా తో కాస్త ఫేమస్ అయ్యింది, ఇప్పుడు తెలుగు డైరెక్టర్ లకు అసలు సినిమాలు తీయడం వచ్చా అని మొఖం మీదే అడిగేసి తెలుగు లో చస్తే సినిమాలు చెయ్యను అనిమొండిగా చెబుతోంది. పెద్ద హీరో పక్కనో చాన్స్ ఒస్తే ఇవన్నీ తూచ్ అని వదిలేసి  కాల్ షీట్ లు ఇవకుండా ఉంటుందా? చూదాం!
Previous
Next Post »