0

భూమి పుట్టాక మొదటి మర్డర్‌ ఇదే!

ఉత్తర స్పెయిన్‌లోని సీమా డి లాస్‌ హ్యూసోస్‌ అనే ప్రాంతంలో బింగిమ్‌టన్‌ యూనివర్శిటీకి చెందిన ఆంథ్రోపాలజిస్ట్‌ రాల్ప్‌ క్వామ్‌ సారధ్యంలో తవ్వకాలు
లండన్‌ : ప్రపంచం పుట్టిన తర్వాత జరిగిన తొలి హత్య ఏది? ఈ ప్రశ్నకు శాస్త్రవేత్తలు తాజాగా సమాధానమిచ్చారు. స్పెయిన్‌లో 4,30,000 సంవత్సరాల క్రితం నాటి ఓ మానవ అస్థిపంజరాన్ని శాస్త్రవేత్తలు ఈ మధ్య కనుగొన్నారు. ఉత్తర స్పెయిన్‌లోని సీమా డి లాస్‌ హ్యూసోస్‌ అనే ప్రాంతంలో బింగిమ్‌టన్‌ యూనివర్శిటీకి చెందిన ఆంథ్రోపాలజిస్ట్‌ రాల్ప్‌ క్వామ్‌ సారధ్యంలో ఆర్కియాలజిస్టులు భారీగా తవ్వకాలు జరిపారు. 

ఈ తవ్వకాల్లో ఓ మానవ అస్థిపంజరం బయటపడిరది. అది హత్యకు గురైన ఓ వ్యక్తి అస్థిపంజరమని నిర్ధారించారు. ఇంతకీ అది ఎన్నాళ్ళ క్రితంనాటి అస్థిపంజరమని పరిశోధనలు చేయగా చివరకు 4,30,000 సంవత్సరా క్రితం నాటి అస్థిపంజరమని తేలింది. దీంతో వారికి లభ్యమైన సాక్ష్యాధారాల ఆధారంగా ఈ అస్థిపంజరానికి సంబంధించిన వ్యక్తి 4,30,000 ఏళ్ళ క్రితం మర్డర్‌కు గురయ్యాడని నిర్ధారించారు. 

ఈ భూమి పుట్టిన తర్వాత ఇదే మొదటి హత్య అయివుంటుందని కూడా అంచనా వేశారు. 13 మీటర్ల లోతు నుంచి ఈ అస్థిపంజరాన్ని వెలికితీశారు. 52 ముక్కలుగా ఇది దొరికింది. క్రేనియం 17 అని ఈ అస్థిపంజరానికి పేరుపెట్టారు. పదునైన ఆయుధంతో అతన్ని చంపినట్లుగా గుర్తులు కన్పిస్తున్నాయి. 20 ఏళ్ళపాటు జరిగిన తవ్వకాల అనంతరం అత్యంత పురాతనమైన హత్యోదంతం మిస్టరీని శాస్త్రవేత్తలు ఛేదించినట్లయింది
Previous
Next Post »