తల్లి సారిక సోయగాన్నీ,
తండ్రి కమల్ హాసన్ నటనని వారసత్వంగాపుచ్చుకుని వెండితెరకు వచ్చిన ముద్దుగుమ్మ శృతిహాసన్.
ఆ ఇద్దరూ తనకు ఆదర్శమే అయినప్పటికీ.. తన రూటే సపరేటు అంటోంది. తనకు సాంబార్ రైస్ అంటే
అమితయిష్టమని, దాన్ని అమితంగా ఇష్టపడే వ్యక్తినే నేను పెళ్లి చేసుకుంటానని లేదంటే పెళ్లి
చేసుకోబోనని తెగేసి చెప్పింది.
తన
పెళ్లి అంశం ప్రస్తావనకు వచ్చినపుడు శృతిహాసన్ తన మనస్సులోని మాటను వెల్లడించింది.
నా ప్రపంచం చాలా చిన్నది. నాకు ఉన్న స్నేహితులు తక్కువ. స్నేహితులని
ఎందుకన్నానంటే... కొంతమందితోనే మనసు విప్పి మాట్లాడగలను. అలాగే నా అభిరుచులు,
ఇష్టాయిష్టాలు కూడా. ఉదాహరణకు నాకు సాంబార్ రైస్ అంటే చాలా ఇష్టం. ఆ వచ్చే
వ్యక్తికి కూడా అలాంటి ఇష్టాలే ఉండాలి. అప్పుడే మ్యారేజ్ లైఫ్‌ని ఎంజాయ్ చేయగలం.
లేకపోతే విడిపోవడమే అవుతుంది. ఈ గొడవలన్నీ ఎందుకని... పెళ్ళి మానేస్తే పోలా
అనిపిస్తోందన్నారు.
అయితే,
నేను పెళ్లి చేసుకోను అనేదానికి, నా తల్లిదండ్రులు విడిపోయి ఉండటానికి ఎలాంటి
లింకు లేదన్నారు. నాకు తగ్గవాడు కనిపిస్తే తప్పకుండా చేసుకుంటా. లేకపోతే లేదు అని
చెబుతున్నా అంతే! ఒకవేళ చేసుకుంటే మాత్రం ఈ రంగానికి చెందిన వ్యక్తినే
చేసుకుంటాను. ఎందుకంటే ఒకరి ప్రొఫెషన్ గురించి మరొకరికి మంచి అవగాహన ఉంటుంది.
లైఫ్ బాగుంటుంది... ఇద్దరం ఎంజాయ్ చేయగలుగుతాం అని ఈ గంధర్వ కన్య నవ్వుతూ
చెప్పింది.
Sign up here with your email
ConversionConversion EmoticonEmoticon