0

అభిషేక్ బచ్చన్ ఆ ప్రొడ్యూసర్ ని కొట్టబోయాడట

బాలీవుడ్ లో హ్యుమానిటీ కోసం బాలీవుడ్ హీరోలందరు కలిసి ఫుట్ బాల్ గేం ఆడారు. దీనిలో అభిషేక్ బచ్చన్, రణబీర్ కపూర్,బంటీ వాలియా,అర్మాన్ జైన్ లాంటి వారు పాటిస్పేట్ చేశారు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్న ప్రేక్షకుల కోసం తమ సమయాన్ని కాస్త కేటాయిస్తారు బాలీవుడ్ హీరోస్. 

అయితే రీసెంట్ గా జరిగిన ఈ ‘ప్లే ఫర్ హ్యూమనీటీ’ కార్యక్రమంలో చిన్న అపశృతి దొర్లిందంట. ఆట ని స్పోర్టివ్ గా ఆడాలనే తపనతో అభిషేక్ బచ్చన్, ప్రొడ్యూసర్ బంటీ వాలియాల మద్య మాటల యుద్ధం నడించిందట. అంతేకాదు ఒకరి మీద ఒకరు వచ్చేంత దూరం వెళ్ళిందట ఈ గొడవ.
    
అయితే ఫీల్డ్ లో ఉన్న రణబీర్ దాన్ని సెట్ చేసేశాడట.. ఇద్దరిని బుజ్జగించి మళ్ళీ ఆటను కొనసాగించేలా చేశారట. అయినా ఆడేది హ్యూమనిటీని ప్రేక్షకుల హృదయాల్లో నింపడం కోశం అలాంటి ప్రదేశాల్లోనే వీళ్ళు ఇలా విచక్షణా రహితంగా కొట్టుకులాడితే ఎలా చెప్పండి. బంటి వాలియా కి ఇలాంటి న్యూసెన్స్ లను క్రియేట్ చేయడం కొత్తేమి కాదు..
 

2011 మాన్యతా బర్త్ డే పార్టీలో కూడా సల్మాన్ ఖాన్ తో గొడవ పడ్డాడనే వార్తలు వచ్చాయి. ప్రొడ్యూసర్ కాబట్టి సల్మాన్ బ్రదర్ తో బంటి బిజినెస్ షేర్ చేస్తుంటాడు. సల్మాన్ ఖాన్ సోదరుడు బంటి బిజినెస్ లో పార్ట్ నర్స్.. ఆ బర్త్ డే పార్టీలో కూడా సల్మాన్ తగ్గబట్టి గొడవ సర్దుమనిగింది లేదంటే అక్కడ చాలా పెద్ద న్యూసెన్స్ అయ్యి ఉండేది.
   
చారిటీ కోసం చేస్తున్నమన్న బుద్ధి కూడా లేకుండా ఇలా రోడ్ సైడ్ రౌడిల్లా గొడవలు పడితే ఆడియెన్స్ కి చులకన అవ్వడం తప్పితే ఇంకోటి లేదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటే బెటర్ లేదంటే చాలా రిస్క్ ఫేస్ చేయాల్సి వస్తుంది బీ టౌన్ లో.


      
Previous
Next Post »