ఆయన తమిళ, మళయాల భాషల్లో మంచి హీరో. పేరు జయరామ్.. ఆయన ఇంట్లో ఏనుగు
దంతాలు బయటపడ్డాయి. అవి ఆయనను చిక్కుల్లో పడేశాయి. అటవీ జంతువుల హక్కుల
ఉద్యమకారులు ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఆందోళన ఉధృతం చేశారు. వెంటనే
ఆయనపై చర్యలు తీసుకోవాలని తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
జయరామ్‑‑ ఓ ఏనుగును పెంచుకునే వాడు. అది రెండేళ్ల కింద ఏనుగు
చనిపోయింది. అయితే దాని రెండు దంతాలు తొలగించి ఆయన తన వద్ద పెట్టుకున్నాడు. కేరళ
అటవీ శాఖ కూడా ఇటీవల అందుకు ఆమోదం తెలిపింది. దీంతో జంతు ప్రేమికుల్లో ఆగ్రహం
కట్టలు తెంచుకుంది. ఇది మిగితా వారికి తప్పుడు సూచన ఇచ్చినట్లవుతుందని ఆందోళన
ప్రారంభించింది.
2003 డిక్లరేషన్ వైల్డ్ లైఫ్ స్టాక్ రూల్ ప్రకారం.. అది నేరమని
గుర్తు చేశారు. ఏ వ్యక్తి అయినా జంతువుపైగానీ, చనిపోయిన తర్వాత దాని అవశేషాలపైగానీ
హక్కు పొందాలంటే ముందు వారసత్వ దృవపత్రాన్ని పొందాలని అలాంటిదేమి జయరామ్ వద్ద
లేదని వారు అంటున్నారు. అయితే, ఈ విషయం తీవ్రం కావడంతో ఫారెస్ట్ టాస్క్ ఫోర్స్
ప్రధాని నరేంద్రమోదీకి ఓ లేఖ రాసింది. వెంటనే ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని
ప్రధానిని వారు లేఖలో కోరారు
Sign up here with your email
ConversionConversion EmoticonEmoticon