సాధారణంగా ప్రేమోన్మాదులో లేకు వేరేదైనా కారణంగా యాసిడ్ దాడి జరుగుతుండటం వినేవుంటాం. అయితే ఓ సినీ దర్శకుడు తన ఇష్టానికి వ్యతిరేకంగా మరో హీరోతో కలిసి నటిస్తుండటాన్ని సహించక నటీనటులపై యాసిడ్ దాడి చేసిన ఘటన భోజ్ పురిలో చోటుచేసుకుంది. భోజ్ పురి సినీ పరిశ్రమలో జరిగిన ఈ దారుణం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.
రూపాలి (20), వికాస్ (19) అనే ఇద్దరు నటీనటులపై అజయ్ కుమార్ అనే సినీ దర్శకుడు యాసిడ్ దాడి చేశాడు. వారిద్దరూ షూటింగ్ కోసం వచ్చి ఓ కాలేజీ ప్రాంగణంలో నిద్రపోతుండగా ఈ దాడి జరిగింది. యాసిడ్ పోసిన వెంటనే అజయ్ కుమార్ అక్కడి నుంచి పారిపోయాడని ఏఎస్పీ గోస్వామి తెలిపారు.
ఈ యాసిడ్ దాడిలో గాయపడిన వారిద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిద్దరిలో రూపాలి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. రూపాలిపై కోపంతోనే అజయ్ ఈ పని చేశాడని సమాచారం. ఇక పారిపోయిన దర్శకుడు అజయ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Sign up here with your email
ConversionConversion EmoticonEmoticon