న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పెద్ద కుమార్తె మలియా ఈ వేసవి సెలవులకు ఉద్యోగంలో చేరనుంది. హెచ్‌బీవో ఛానల్‌లో నటి లీనా డన్హామ్ నిర్వహిస్తున్న 'గర్ల్స్' కార్యక్రమం అంటే మొదటి నుంచి మలియాకు ఎంతో ఇష్టం.
తన ఆసక్తి మేరకే లీనా డన్హామ్ వద్దనే ఉద్యోగంలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే 17వ పుట్టిన రోజు జరుపుకొన్న మలియా గ్రాడ్యుయేషన్ తర్వాత టీవీ లేదా సినిమా రంగంలో కొనసాగాలనుకుంటున్నట్లు పీపుల్ మ్యాగజైన్‌కు తెలిపారు.
అయితే గత వారమే బ్రూక్లైయిన్‌లో జరిగిన గర్ల్స్ షూటింగ్ సెట్‌లో మలియా కనిపించిందని అమెరికన్ మీడియా వార్తా కథనాలను ప్రచురించింది. గతంలో మలియా తాను లీనా డన్హామ్ అభిమానినని, ఆమె నిర్వహిస్తున్న 'గర్ల్స్' కార్యక్రమం అంటే చాలా ఇష్టమని చెప్పింది.
ఫిల్మ్ మేకింగ్‌లో ఆసక్తి ఉన్నట్లు, సినీ దర్శకురాలు కావాలనేది మలియా కోరికని గతంలో ఫస్ట్ లేడీ మిచెల్ ఒబామా ఒకానొక సందర్భంలో చెప్పారు. మలియా ఎంతగానో ఇష్టపడే లీనా డన్హామ్, మలియా పుట్టినరోజు నాడు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.
Sign up here with your email
ConversionConversion EmoticonEmoticon