గత జన్మ విశేషాలంటూ ఎవరైనా చెప్తే అవన్నీ మోసపూరిత కథలని కొట్టిపారేస్తుంటాం. కానీ రాజస్థాన్‌కు చెందిన ఓ బాలిక గత జన్మ విశేషాలను పూసగుచ్చినట్లు చెప్తోంది. అవన్నీ నిజం కావడం విశేషం. రాజస్థాన్‌లోని ఆల్వార్ ప్రాంతానికి చెందిన పూనమ్ (14)కి అకస్మాత్తుగా గత జన్మ జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు వివరించింది. చిన్నపిల్ల కథలు విని ఊహించుకుని చెప్తోందని లైట్‌గా తీసుకున్నారు.
కానీ పూనమ్ పదే పదే గత జన్మలో ఫలానా ఊరి సర్పంచ్ కూతుర్నని, రెండేళ్ల వయసులో ప్రాణాలు కోల్పోయానని, తన పేరు వసుంధర అని, తనకు ఇద్దరు తమ్ముళ్లు కూడా ఉన్నారని అంటోంది. అంతేగాకుండా గత జన్మ తల్లిదండ్రులను చూస్తానని పట్టుబట్టడంతో పూనమ్ కోరిక తీర్చాలని ఆమె తల్లిదండ్రులు భావించారు. దీంతో పూనమ్ చెప్పిన గ్రామానికెళ్లి ఆరాతీశారు. ఆశ్చర్యకరమైన విశేషం ఏమిటంటే...? పూనమ్ చెప్పినవన్నీ నిజాలేనని తేలింది. దీంతో ఆ గ్రామస్తులు పూనమ్‌ను అద్భుతంగా చూస్తున్నారు.
Sign up here with your email
ConversionConversion EmoticonEmoticon