యాంకర్ అనసూయ నోరు పారేసుకోవడం. తిరిగి క్షమాపణలు చెప్పడం ఇదే పని.
అందునా మెగా ఫ్యామిలీ హీరోలపైనే ఆమె కామెంట్లు పడేస్తుంటారు. తాజా మళ్లీ
వార్తల్లోకి ఎక్కేసింది. స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్‌పై ఆమె చేసిన వ్యాఖ్యలు
తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. గంగోత్రి మూవీలో ఈ హీరో విచిత్రంగా కనిపించాడంటూ
వ్యాఖ్యానించింది.
ఆమె చేసిన కామెంట్స్‌పై సోషల్ మీడియాలో పెనుదుమారం రేగింది. ఇది
గమనించిన అనుసూయ నాలుక కరుచుకుంది. అల్లుఅర్జున్ తన ఫేవరేట్ హీరో అంటూ అనసూయ
క్లారిటీ ఇచ్చింది. మెగా హీరోలతో కామెంట్స్ చేయడం ఆమెకు కొత్తేమీకాదు.
గతంలో అత్తారింటికి దారేదిలో ఐటెంసాంగ్ చేసే అవకాశం వస్తే చేయనని
ఖరాఖండిగా చెప్పేసింది. అంతేకాదు ఆ మూవీ విడుదలైన తరువాత అనసూయ చేసిన కామెంట్స్‌పై
మెగా అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు. అంతటితో ఆగని అనుసూయ తాజాగా ఇలా అల్లు
అర్జున్‌పై కామెంట్లు చేయడం గమనార్హం
Sign up here with your email
ConversionConversion EmoticonEmoticon