‘‘చిన్నతనం నుంచే వ్యాయామం, జాగింగ్ అలవాటుంది. దాంతో బాడీ ఫిట్‌నెస్
మీద కొంత అవగాహన కలిగింది. సినిమాల్లోకి వచ్చాక ఫిట్‌నెస్ మీ మరింత శ్రద్ధ పెరిగింది.
నన్ను ఫిట్‌నెస్ సైకో అనొచ్చు’’ అని అంటోంది రకుల్‌ప్రీత్ సింగ్. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’తో
విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ సమయంలో భారీ సినిమాల్లో అవకాశాలు
అందుకుంది.
రకుల్ మాట్లాడుతూ ‘‘చిన్పప్పుడు నాన్నతో జాగింగ్‌కు వెళ్లేదానిని. మోడల్
అయ్యాక జిమ్‌కి వెళ్ళడం మొదలుపెట్టాను. ఇప్పుడైతే ఒక్కరోజు జిమ్ చెయ్యకపోయినా చిరాగ్గా
ఉంటుంది. జిమ్‌లో కొన్ని వర్కవుట్స్ తర్వాత బాడీ నొప్పిగా ఉంటుంది. ఆ నొప్పి అంటే
నాకు చాలా ఇష్టం. క్రమంగా జిమ్‌కి భానిసనైపోయాను. డైలీ వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం
తీసుకోవడమే నా ఫిట్‌నెస్ రహస్యం’’ అని చెప్పుకొచ్చింది.
‘‘నా ఎత్తు ఆరడుగులకు తక్కువే.
ఈ ఎత్తున్నవాళ్ళు జీరో సైజ్‌కి సూట్‌కారు. నేను జీరో సైజ్ బాడీ చేస్తే తెరపై సన్నని
కడ్డీలా కనిపిస్తాను. అందుకే దాని జోలికి వెళ్లడం లేదు’’ అని తెలిపింది రకుల్. ప్రస్తుతం
ఆమె నటించిన ‘కిక్-2’ విడుదలకు సిద్ధమవుతోంది. అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్‌చరణ్
వంటి అగ్ర హీరోల సరసన నటిస్తోందీ ముద్దుగుమ్మ.
Sign up here with your email
ConversionConversion EmoticonEmoticon