ఆమె ఎంపీ..సీఎం భార్య..అయినా ఆకతాయి వేధింపుల నుంచి తప్పించుకోలేకపోయింది. ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది.ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ సెల్‌ఫోన్ కు ఓ 22 ఏళ్ల యువకుడు అసభ్యకర సందేశాలు పంపాడు.మొదట్లో వీటిని పెద్దగా పట్టించుకోకపోయినా, నానాటికీ సందేశాల తీవ్రత పెరగడంతో విషయాన్ని అమె సీరియస్ గా తీసుకున్నారు..
సందేశాలపై సమాజ్‌వాదీ పార్టీ యూత్ నాయకులకు తెలపడంతో పాటు పోలీసులకు పిర్యాదు చేశారు..దీంతో డింపుల్‌ను మానసికంగా వేదించిన ఆ పోకిరీ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటన పై సామాజిక మాధ్యమాల్లో జోరుగా చర్చ జరుగుతుంది.ఓ సీఎం భార్యకే వేధింపులు తప్పకపోతే ఇక సామాన్య మహిళకకు రక్షణ ఏంటని..? పలువురు నెటిజన్లు ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు.
Sign up here with your email
ConversionConversion EmoticonEmoticon