దాదాపు రెండేళ్ల పాటు కష్టించి నిర్మించిన చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం అందుకోవడంతో బాహుబలి చిత్ర బృంద ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీంతో బాహుబలి చిత్రం బృందం చిత్ర విజయవేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు.ఇందులో ఓ చిన్న పిల్లాడ్ని చిత్ర బృందం కోసుకుతిన్నారు.
అయితే అది ఓ కేకు మాత్రమే. బాహుబలి ఫస్ట్ లుక్ పోస్టర్ లో చిన్న పిల్లాడు ఉన్న విధంగానే ఓ భారీ కేకును తయారుచేయించి, దానిని కట్ చేసిన దర్శకుడు రాజమౌళి చిత్ర విజయ సంబురాలను ఆరంభించగా, ఆ సంబురాల్లో చిత్ర బృందం పాల్గొంది. బాక్సాఫీస్ తో పాటు అమెరికా లోనూ పలు రికార్డు ను బాహుబలి సొంతం చేసుకుంది.
ఈ చిత్రాన్ని ఆర్కా మీడియా వర్క్స్ పై నిర్మించారు. కాగా బాహుబలి రెండవ అర్ధభాగం బాహుబలి ది కంక్లూజన్ ఇప్పటికే 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకోగా, మిగిలిన భాగాన్ని సెప్టెంబర్ నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది.
Sign up here with your email
ConversionConversion EmoticonEmoticon