రాంచీ: ఏ సమయంలోనైనా ఆపదలో ఉంటే మీ కోసం మేమున్నామంటూ ప్రజల భద్రత దృష్ట్యా ప్రభుత్వం ఎమర్జెన్సీ నెంబర్ '100'ను ప్రకటించింది. అయితే జార్ఖండ్ పోలీసులకు మాత్రం ఆకతాయి ఫోన్ కాల్స్‌తో పెద్ద సమస్య వచ్చిపడుతుందంట. '
100'కు వచ్చే ఫోన్ కాల్స్‌లో ఎక్కువ శాతం ఫేక్ కాల్స్ ఉంటున్నాయని అధికారులు తెలిపారు. గత వారంలో ఎమర్జెన్సీ నెంబర్ విభాగానికి వచ్చిన ఫోన్ కాల్స్‌లో 3600 ఫోన్ కాల్స్ నకిలీవని ఆ విభాగం ఇన్‌ఛార్జి ట్రాఫిక్ ఎస్పీ ఎస్.కార్తిక్ తెలిపారు. ఈ నకిలీ ఫోన్ కాల్స్‌తో పోలీసు అధికారులకు చిర్రెత్తు కొస్తుందంట. వీటిల్లో కొన్ని 'ఇంట్లో ఒంటరిగా ఉన్నా, దయ చేసి రండి.. ', 'బోర్ కొడుతోంది, కాసేపు మాట్లాడండి..', 'పిల్లలు ఏడుస్తున్నారు.. ఆడివ్వమని' ఇలా రకరకాలుగా విసిగించే ఫోన్లు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
ఎమర్జెన్సీ నెంబర్ 100కు వచ్చిన ఫోన్‌కాల్స్‌లో 15 మాత్రమే సరైనవని, మిగతా కాల్స్ బ్లాంక్ కాల్స్ అని, మిగిలినవన్నీ ఫేక్ కాల్స్ అని తెలిపారు. నకిలీ కాల్స్ వచ్చిన నెంబర్లను నమోదు చేసుకున్నామని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
పోలీసులకే ఫోన్ చేసి వారితో ఆటలాడుకుంటున్నా వారిని ఊరికే వదలబోమని హెచ్చరించారు. ఎమర్జెన్సీ సమయంలో ఉపయోగపడాల్సిన నెంబర్ 100ను ఇలా చాలా మంది దుర్వినియోగం చేయడం నేరమని పేర్కొన్నారు.
Sign up here with your email
ConversionConversion EmoticonEmoticon